అయోధ్యలో బాల రాముడు భక్తులకు దర్శనమిస్తున్నారు. దీంతో అయోధ్యకు భక్తులు భారీగా తరలివెళ్తున్నారు. ఇలాంటి తరుణంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ రాష్ట్రంలో లోక్ సభ నియోజక వర్గాలు, వాటికి అనుబంధంగా ఉంటే అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి భక్తులను ఉచితంగా అయోధ్యకు తీసుకువెళ్లనున్నారు. అసెంబ్లీకి 200మంది చొప్పున ప్రత్యేక రైళ్లలో తీసుకువెళ్లనున్నారు. జనవరి 29 నుంచి ఫిబ్రవరి 15 వరకు 17 రోజుల పాటు ఈ ప్రత్యేక రైళ్లు నడవనున్నాయి.
ఇది కూడా చదవండి: ఆడవారికి తెలంగాణ TSRTC మరో గుడ్ న్యూస్..
సికింద్రాబాద్ పార్లమెంట్ – జనవరి 29న
వరంగల్ పార్లమెంట్ – జనవరి 30న హైదరాబాద్- జనవరి 31న
కరీంనగర్- ఫిబ్రవరి 1
మల్కాజిగిరి- ఫిబ్రవరి 2
ఖమ్మం- ఫిబ్రవరి 3
చేవెళ్ల- ఫిబ్రవరి 5
పెద్దపల్లి- ఫిబ్రవరి 6
నిజామాబాద్- ఫిబ్రవరి 7
ఆదిలాబాద్- ఫిబ్రవరి 8
మహబూబ్ నగర్- ఫిబ్రవరి 9 మహబూబాబాద్- ఫిబ్రవరి 10
మెదక్- ఫిబ్రవరి 11
భువనగిరి- ఫిబ్రవరి 12
నాగర్ కర్నూల్- ఫిబ్రవరి 13
నల్గొండ- ఫిబ్రవరి 14
జహీరాబాద్- ఫిబ్రవరి 15
ఇది కూడా చదవండి: తెలంగాణ RTCలో ఉద్యోగాలు.. త్వరపడండి..
ఈ రైళ్లు అన్నీ కాజీపేట, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి బయల్దేరనున్నాయి. నల్గొండ, వరంగల్, మహబూబాబాద్, ఖమ్మం, పెద్దపల్లి, కరీంనగర్, భువనగిరి నియోజకవర్గాలకు చెందిన భక్తులు కాజీపేట స్టేషన్ నుంచి బయల్దేరాలి. సికింద్రాబాద్, నిజామాబాద్, జహీరాబాద్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, మల్కాజిగిరి, మెదక్, చేవెళ్ల నియోజకవర్గాలకు చెందిన భక్తులు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి బయల్దేరాలి.
ఇది కూడా చదవండి: KTR సంచలన వ్యాఖ్యలు.. హామీలు అమలు చేయకపోతే నడిరోడ్డుపై..