Homeహైదరాబాద్latest Newsప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి : Revanth Reddy

ప్రజలకు పూర్తి స్థాయిలో వైద్య సేవలు అందించాలి : Revanth Reddy

బీబీనగర్ ఎయిమ్స్ లో వైద్య సేవలు పూర్తిగా అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తెలంగాణలో వైద్య కళాశాల ఉన్న ప్రతిచోట నర్సింగ్ పారామెడికల్ కాలేజీలు ఉండాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. కొడంగల్లో మెడికల్, నర్సింగ్ కాలేజీ ఏర్పాటును పరిశీలించాలని అధికారులకు సీఎం చెప్పారు.. సచివాలయంలో వైద్యారోగ్య శాఖ అధికారులకు సీఎం చెప్పారు.

డిజిటల్ హెల్త్ కార్డు

డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డును ఆరోగ్యశ్రీతో అనుసంధానం చేయాలన్నారు. ప్రభుత్వ ఆస్పత్రులకు ప్రతి నెలా, ప్రైవేటు ఆస్పత్రులకు 3 నెలలకోసారి ఆరోగ్యశ్రీ బిల్లులు చెల్లించాలి. వైద్య సేవల కోసం అందరూ హైదరాబాద్లోనే ఆధారపడే పరిస్థితి ఉండకూడదు. ఆ నిబంధనను సడలించే అంశాన్ని పరిశీలించాలని అధికారులకు చెప్పారు. పెండింగ్ బిల్లులు రూ.270 కోట్లు వెంటనే విడుదల చేయాలి. డిజిటల్ హెల్త్ ప్రొఫైల్ కార్డులు సిద్ధం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. . ఆరోగ్యశ్రీ కోసమే తెల్లరేషన్ కార్డు తీసుకునే వారి సంఖ్య పెరుగుతోందని, ‘వరంగల్, ఎల్బీనగర్, సనత్నగర్, అల్వాల్ టీమ్స్ ఆస్పత్రుల నిర్మాణ పనులు వేగంగా పూర్తి చేయాలి. జిల్లాల్లోనూ మెరుగైన వైద్య సేవలు అందేలా చర్యలు చేపట్టాలి. వైద్య సిబ్బందికి సకాలంలో జీతాలు చెల్లించాలి” అని సీఎం రేవంత్ అధికారులకు సూచించారు.

Recent

- Advertisment -spot_img