HomeజాతీయంFree FASTag : ఫాస్ట్‌ట్యాగ్ ఉచితంగా పొందండి ఇలా

Free FASTag : ఫాస్ట్‌ట్యాగ్ ఉచితంగా పొందండి ఇలా

Do you mostly travel on the roads? Going over toll plazas? Fast‌tag is a must though.

Does your vehicle have a fasttag? Get it for free though.

The National Highway Authority of India-NHAI FastTag is being provided free of charge.

మీరు ఎక్కువగా రహదారులపై ప్రయాణిస్తుంటారా? టోల్ ప్లాజాల మీదుగా వెళ్తుంటారా? అయితే ఫాస్ట్‌ట్యాగ్ తప్పనిసరి.

మీ వాహనానికి ఫాస్ట్‌ట్యాగ్ లేదా? అయితే ఉచితంగా పొందొచ్చు.

నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా-NHAI ఫాస్ట్‌ట్యాగ్ ఉచితంగా అందిస్తోంది.

దేశంలోని 770 జాతీయ రాష్ట్ర రహదారుల్లో ఉన్న టోల్ ప్లాజాల్లో మార్చి 1 వరకు ఉచితంగా ఫాస్ట్‌ట్యాగ్ పొందొచ్చు.

ప్రస్తుతం టోల్ ప్లాజాల దగ్గర ఫాస్ట్‌ట్యాగ్‌ల ద్వారా రోజూ 60 లక్షల లావాదేవీలు జరుగుతన్నాయి.

రోజువారీ కలెక్షన్ రూ.95 కోట్లకు చేరుకుందని NHAI ప్రకటించింది.

ఫాస్ట్‌ట్యాగ్‌లు లేనివాళ్లు టోల్ ప్లాజాల దగ్గర రెట్టింపు ఛార్జీలను చెల్లించాల్సిందే.

టోల్ ప్లాజాల దగ్గర ఏవైనా సాంకేతిక సమస్యలు ఉంటే వాహనదారులు ఒక్క రూపాయి కూడా చెల్లించకుండా వెళ్లొచ్చని NHAI ప్రకటించింది.

అయితే వారి ఫాస్ట్‌ట్యాగ్‌లో బ్యాలెన్స్ ఉన్నన్ని రోజులు ఈ సదుపాయం ఉంటుంది.

ఇప్పటికీ కొన్ని వాహనాలకు ఫాస్ట్‌ట్యాగ్‌లు లేవు. ఆ వాహనదారులు కూడా ఫాస్ట్‌ట్యాగ్‌లు తీసుకునేలా NHAI ప్రోత్సహిస్తోంది.

ఫాస్ట్‌ట్యాగ్ తీసుకున్న వాహనదారులు అందులో బ్యాలెన్స్ మెయింటైన్ చేయాలి.

ఫాస్ట్‌ట్యాగ్‌లోని బ్యాలెన్స్ తెలుసుకోవడానికి My FASTag App ఉపయోగించొచ్చు.

అందులో ఫాస్ట్‌ట్యాగ్ బ్యాలెన్స్ స్టేటస్ తెలుస్తుంది. కలర్ కోడ్స్‌లో బ్యాలెన్స్ తెలుస్తుంది.

బ్యాలెన్స్ సరిపడా ఉంటే గ్రీన్ కలర్‌, తక్కువ బ్యాలెన్స్ ఉంటే ఆరెంజ్ కలర్, నెగిటీవ్ బ్యాలెన్స్ ఉంటే రెడ్ కలర్ చూపిస్తుంది.ఫాస్ట్‌ట్యాగ్‌ను మీరు ఎక్కడైనా తీసుకోవచ్చు.

 

నేషనల్ హైవే టోల్ ప్లాజాలతో పాటు బ్యాంకులు, ఆర్‌టీఓలు, కామన్ సర్వీస్ సెంటర్లు, ట్రాన్స్‌పోర్ట్ హబ్స్, బ్యాంక్ బ్రాంచ్‌లు, ఎంపిక చేసిన పెట్రోల్ బంకులు, వ్యాలెట్ సర్వీసులు అందించే సంస్థల నుంచి ఫాస్ట్‌ట్యాగ్ కొనుగోలు చేయొచ్చు.

Recent

- Advertisment -spot_img