సంగారెడ్డి జిల్లా రుద్రారంలో శుక్రవారం బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుంది. గీతం యూనివర్సిటీ భవనంపై నుంచి దూకి రేణుశ్రీ అనే విద్యార్థిని ప్రాణాలు తీసుకుంది. మృతురాలు గీతం వర్సిటీలో బీటెక్ ఫస్టియర్ చదువుతున్నట్లు తెలుస్తోంది. విద్యార్థిని ఎందుకు ఆత్మహత్య చేసుకుందో కారణాలు తెలియాల్సి ఉంది.