రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్ లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ప్రియురాలు అనుష్క మోసం చేసిందని ఐటీ ఉద్యోగి ఇమ్రోస్ పటేల్ (28) ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన లవర్ మరో అబ్బాయితో చనువుగా ఉంటూ అతడిని పట్టించుకోవటం లేదని తెలిసిందని.. దాంతో మనస్థాపానికి గురైనట్టు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.