– ఎర్రబెల్లి ఆడియో క్లిప్ హల్చల్
– సోషల్ మీడియాలో ఆడియో క్లిప్ వైరల్
ఇదే నిజం, వరంగల్ ప్రతినిధి: మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు టెలీ కాన్ఫరెన్స్‌లో మాట్లాడిన ఓ ఆడియో క్లిప్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ పథకం, దళితబంధు, బీసీ బంధు, మైనార్టీ బంధు, గృహలక్ష్మి స్కీమ్‌పై మంత్రి ఈ టెలీ కాన్ఫరెన్స్ లో పలు కీలక సూచనలు చేశారు. కాంట్రవర్సీ లేని చోటే దళిత బంధు ఇవ్వాలంటూ మంత్రి మాట్లాడిన మాటలు స్వల్ప వివాదాస్పదంగా మారాయి. ఇందుకు సంబంధించిన ఆడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. దళిత బంధు పథకం యునానిమస్‌గా ఏ ఇబ్బంది లేని వాళ్లకే కేటాయించాలంటూ మంత్రి సూచించారు. అలా కానిపక్షంలో దరఖాస్తులు తీసుకోండి అంటూ మంత్రి సూచించారు. రెండో విడతలో ఇస్తామని సర్ది చెప్పండి అంటూ మంత్రి సూచించారు. ఈ లోపు ఎన్నికల కోడ్ వస్తుంది వాళ్లలో వాళ్లే తన్నుకు చస్తారంటూ మంత్రి మాట్లాడారు. ఇటీవల జరిగిన అధికారులు ఎమ్మెల్యేలు ఎంపీలు ప్రజాప్రతినిధులతో కూడిన ఓ టెలీ కాన్ఫరెన్స్ లో మంత్రి ఈ వ్యాఖ్యలు చేశారు. ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా ఈ ఆడియో క్లిప్ వైరల్ అవుతోంది. మరి మంత్రి ఏ రోజు ఏ సందర్భంలో ఈ కామెంట్లు చేశారన్నది తెలియాల్సి ఉంది.