జవాన్ బ్లాక్ బస్టర్ సక్సెస్ తర్వాత లేడీ సూపర్ స్టార్ నయనతార.. తమిళంలో ‘ఇరైవన్’అనే క్రైమ్ థ్రిల్లర్‌లో కనిపించింది. జయం రవి హీరోగా నటించిన ఈ చిత్రానికి ఐ అహ్మద్ దర్శకత్వం వహించారు. తెలుగులో ‘గాడ్’పేరుతో డబ్బింగ్ వెర్షన్ సైతం థియేటర్లలో రిలీజైంది. అయితే, తమిళంలో మిక్స్డ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ తెలుగులో ఆశించిన ఫలితాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం ఈ మూవీ ఓటీటీలోకి వచ్చేసింది. గురువారం నుంచి నెట్ ఫ్లిక్స్ వేదికగా స్ట్రీమింగ్ అవుతోంది. క్రైమ్ థ్రిల్లర్స్ ఇష్టపడే వారికి ఈ వీకెండ్ గాడ్ మూవీ బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. తమిళం, తెలుగుతో పాటు హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో కూడా ఈ చిత్రం అందుబాటులో ఉంది. రాహుల్ బోస్ విలన్‌గా నటించాడు. వినోద్ కిషన్, నరేన్, విజయలక్ష్మి, ఆశిష్ విద్యార్థి కీలక పాత్రలు పోషించారు. యువన్ శంకర్ రాజా మ్యూజిక్ అందించాడు.