ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు రైతులకు శుభవార్త తెలిపారు. రాష్ట్రంలో ఏ రోజుకు ఆ రోజే వీలైతే కేవలం రెండు గంటల్లోనే అకౌంట్లలో ధాన్యం డబ్బులు జమ చేసేలా ప్రణాళికలు చేస్తున్నం అని చంద్రబాబు ప్రకటించారు. 93 శాతం రైతులకు 24 గంటల లోపు డబ్బు చెల్లిస్తున్నట్లు తెలిపారు. దిగుబడి పెరిగి డబ్బు సకాలంలో అందడంతో రైతులు సంతోషంగా ఉన్నారని చంద్రబాబు వెల్లడించారు. దళారీల ముసుగులో రైతులకు అన్యాయం జరిగితే ఊరుకోబోమని చంద్రబాబు హెచ్చరించారు.