Homeహైదరాబాద్latest Newsమీకు గూగుల్ పే ఉందా..? అయితే.. RS.8,00,000 వరకు లోన్..

మీకు గూగుల్ పే ఉందా..? అయితే.. RS.8,00,000 వరకు లోన్..

మీకు ఆర్జెంట్ గా డబ్బులు అవసరం ఉన్నాయా..? ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ లోన్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా.. గూగుల్ పే యూజర్ అయితే మీకు గుడ్ న్యూస్. గూగుల్ పే ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.8 లక్షల వరకు లోన్ అందించనుంది. ఈ లోన్ ను నెలకు రూ. 1000 చొప్పున ఈఎంఐ ద్వారా పే చేయవచ్చు. ఎక్కడికి వెళ్లకుండా సింపుల్ గా లోన్ పొందవచ్చు.

ప్రాసెస్ ఇది..

*గూగుల్ పే యాప్‌లోకి వెళ్లండి*

*తర్వాత ఆఫర్స్ అండ్ రివార్డ్స్ అనే ఆప్షన్ లోకి వెళ్లండి

*తర్వాత మేనేజ్ యువర్ మనీ ఆప్షన్ లోకి వెళ్లాలి.

*అక్కడ మీకు కనిపించే లోన్ ఆప్షన్ క్లిక్ చేసి మీకు అవసరమైన అమౌంట్ వివరాలు పొందుపరచాలి.

*ఆ తరువాత అప్లై నౌ అనే ఆప్షన్ క్లిక్ చేయాలి

* కొత్త పేజ్ ఓపెన్ అయ్యి లోన్ వివరాలను తెలుపుతుంది.

*ఇలా చేయడం ద్వారా డిజిటల్ పద్దతిలోలోన్ అప్రువల్ అయ్యి బ్యాంక్ అకౌంట్‌లోకి డబ్బులు వస్తాయి.

లోన్ డబ్బులను మీరు 6 నెలల నుంచి 4 సంవత్సరాల వరకు పే చేసుకోవచ్చు. మీరు తీసుకున్న లోన్ కి 13.99 శాతం వడ్డీ రేటుతో ప్రారంభం అవుతుంది. లోన్ ఫెసిలిటీని గూగుల్ పే డైరెక్ట్ గా కాకుండా డీఎంఐ ఫైనాన్స్ భాగస్వామ్యంతో అందిస్తుంది.

లోన్ తీసుకునేందుకు మీ మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడీ, వర్క్ డీటెయిల్స్, అడ్రస్ ఇలా పూర్తివివరాలను అందించాలి. అన్ని వివరాలను ఇచ్చిన తర్వాత లోన్ ఎంత వస్తుందని తెలుస్తుంది. మీ లోన్ ఎలిజిబిలిటీ అయితే లోన్ తీసుకోవచ్చు.

Recent

- Advertisment -spot_img