ఏళ్లుగా ఎదురుచూస్తున్న హైదరాబాద్ వాసులకు శుభవార్త. సుమారు ఏడేళ్లకు పైగా నిర్మాణ దశలోనే ఉన్న ఉప్పల్- నారపల్లి ఫ్లైఓవర్‌కు మోక్షం లభించింది. హైదరాబాద్ నుంచి యాదాద్రి, వరంగల్ మార్గంలో ఏళ్ల తరబడి పెండింగ్‌లో ఉన్న ఉప్పల్- నారపల్లి ఎలివేటెడ్ కారిడార్ ఫ్లై ఓవర్ పనులు ప్రారంభమయ్యాయి. నెల రోజుల్లోగా ఫ్లై ఓవర్ పనులు ప్రారంభించకపోతే టెండర్ రద్దు చేస్తామని గాయత్రి కన్‌స్ట్రక్షన్స్‌ను సీఎం రేవంత్ రెడ్డి డిసెంబర్ మొదటి వారంలో హెచ్చరించడంతో ఫ్లై ఓవర్ పనులను కంపెనీ తిరిగి ప్రారంభించింది.