ఆంధ్రప్రదేశ్ లో రూ.65వేల కోట్ల పెట్టుబడులకు రిలయన్స్ ఎనర్జీ సంసిద్ధత వ్యక్తం చేసింది. పెట్టుబడులకు పూర్తిస్థాయి రోడ్ మ్యాప్‌తో ఆ సంస్థ ప్రతినిధులు నేడు సీఎం చంద్రబాబు సమక్షంలో అవగాహన ఒప్పందం చేసుకోనున్నారు. లోకేశ్ అమెరికా పర్యటనకు ముందు ముంబయిలో ముకేశ్ అంబానీ, అనంత్ అంబానీలతో జరిపిన చర్చలు ఫలవంతమయ్యాయి. దీంతో రాష్ట్రంలో రిలయన్స్ సంస్థ 500 అధునాతన బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయనుంది.