సంగారెడ్డి జిల్లా కోహిర్‌లో వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. కొందరు దుండగులు ప్రభుత్వ కళాశాల మైదానంలో వేటకొడవళ్లతో నరికి మృతదేహం పక్కనే కత్తులు వదిలి వెళ్లారు. మృతుడు కర్నూలు జిల్లా బనగానపల్లి వాసి అన్వర్ అలీ(28) గా పోలీసులు గుర్తించారు. అలీ జగద్గిరి గుట్టలో ఆటోడ్రైవర్‌గా పనిచేస్తున్నాడని..ఆటో డ్రైవర్లు, పాత నేరస్తుల మధ్య తగాదాలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.