ఫజల్ అలీ ఆత్మహత్యపై ఆయన కుమార్తె సంబ్రిన్ స్పందించారు. బ్యాంకు అధికారుల వేధింపుల వల్లే తన తండ్రి ఆత్మహత్య ఆరోపించారు. ఉదయం డ్యూటీకి వెళ్తున్న తన తండ్రి తనను కూడా రమ్మన్నారని పేర్కొంది. ఆయనతో వెళ్తే ఆర్థిక ఇబ్బందులపై కొన్ని విషయాలు చెప్పారన్నారు. ఆ తర్వాత ఇప్పుడే వస్తా అని చెప్పి పక్కకు వెళ్లి తుపాకీతో కాల్చుకున్నారన్నారు. బ్యాంకుల నుంచి తీసుకున్న లోన్ చెల్లించామని, వడ్డీరేట్లు పెంచి డబ్బులు చెల్లించాలని వారు ఒత్తిడి చేశారన్నారు. తరచుగా లోన్ రికవరీ వాళ్లు ఫోన్లు చేసి వేధిస్తున్నారని, తన తండ్రి చనిపోవడానికి కారణమైన బ్యాంకులపై చర్యలు తీసుకోవాలని సంబ్రిన్ డిమాండ్ చేశారు.