Harassment to RTI act activists : ఆర్టీఐ కార్యకర్తల హత్యలపై సంచలన నివేదిక.. సమాచారం తెలుసుకోవడం పౌరుల హక్కు. కానీ, ప్రభుత్వంలో జరిగే అవకతవకల గురించి తెలుసుకునేందుకు సమాచార హక్కును వినియోగించుకోవడం ప్రస్తుతం ప్రమాదకరంగా మారిపోతోంది. ఎందుకంటే సమాచారం తెలుసుకునే వారిపై దాడులు, హత్యలు పెరిగిపోయాయని ట్రాన్స్‌పరెన్సీ ఇంటర్నేషనల్ ఇండియా తాజా నివేదికలో పేర్కొంది.
ఇక ముందట ఆర్టీఐ అప్లై చేసేందుకు కూడా ప్రజలు వెనకాడుతారని, అంతేకాకుండా అప్లై చేసిన వారిని రక్షించడం పెద్ద సవాలేనని నివేదికలో పేర్కొంది. ఆర్టీఐ దినోత్సవం సందర్భంగా సంస్థ సోమవారం ‘స్టేట్ ట్రాన్స్‌పరెన్సీ రిపోర్ట్-2021’ నివేదికను విడుదల చేసింది. ఆర్టీఐ చట్టం 2005లో తీసుకువచ్చినప్పటి నుంచి ఆర్టీఐ అప్లై చేసిన దాదాపు 95 నుంచి 100 మంది హత్యకు గురయ్యారని, మరో 190 మందిపై దాడులు జరిగాయని వెల్లడించింది.
వీరే కాకుండా మరో 10-12 మంది భయపడి ఆత్మహత్య చేసుకున్నారని తెలిపింది. సమాచారం కోసం చేస్తున్న దరఖాస్తులు పెరుగుతున్న క్రమంలో ఆర్టీఐ మరింత గోప్యతను పాటించాలంటూ అభ్యంతరం వ్యక్తం చేసింది.