– మంత్రి కేటీఆర్
ఇదే నిజం, హైదరాబాద్: వందేళ్ల ముందు చూపుతో సీఎం కేసీఆర్ తీసుకున్న విప్లవాత్మక నిర్ణయాల వల్ల హైదరాబాద్ విశ్వనగరంగా అవతరించిందని మంత్రి కేటీఆర్ ఆదివారం ట్విటర్లో వెల్లడించారు. హైదరాబాద్ రహదారి వ్యవస్థలో మార్పులు, మెట్రో రైలు, మౌలిక వసతుల కల్పన, ప్రగతిశీల పారిశ్రామిక విధానం, ఆవిష్కరణలకు అనువైన వాతావరణం, హరితహారం.. ఇలా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన పలు కార్యక్రమాల వల్ల రాష్ట్రానికి గుండెకాయ లాంటి హైదరాబాద్ నగరం మునుపెన్నడూ చూడని అభివృద్ధి సాధించిందని సంతోషం వ్యక్తం చేశారు. హైదరాబాద్‌ను రానున్న రోజుల్లో మరింత అభివృద్ధి చేస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
Read More :
KTR : Sentiment కలిసొచ్చింది గెలుపుమాదే
http://idenijam.com/ktr-we-achieved-success-by-uniting-the-sentiment/