Homeబిజినెస్‌Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

Insurance : కొవిడ్​ ప్రభావంతో ఆరోగ్య బీమాపై చాలా మంది దృష్టిసారిస్తున్నారు.

అలాగే ఆరోగ్య బీమా తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు నిపుణులు.

మరి దాని వల్ల పొందే ప్రయోజనాలు ఏంటో తెలుసుకుందాం.

ఆరోగ్య బీమా ఇప్పుడే మాకెందుకు.. ఇది పెద్దవారికే కదా.. అనే భావన చాలామంది యువత భావించారు.

కానీ, కరోనా తర్వాత ఈ ఆలోచనలో మార్పు వచ్చింది.

ఎవరికైనా, ఏ సమయంలోనైనా జీవితం, ఆరోగ్యం అనిశ్చితిలో పడవచ్చని తెలుసుకున్నారు.

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Walmart | వాల్‌మార్ట్ కొనుగోలు దిశ‌గా అంబానీ.. రిల‌య‌న్స్ ప‌గ్గాలు వ‌దులుకోనున్న ముకేశ్

ఇప్పటి యువత తమ ఆర్థిక విషయాలను నిర్వహించుకోవడంలో చురుగ్గా ఉంటున్నారు.

వైద్య అత్యవసరాల సమయంలోనూ ఆర్థిక శక్తిపై ప్రభావం పడకుండా ఉండాలంటే.. ఆరోగ్య బీమాను చిన్న వయసులోనే కొనాలి.

ఏ ఆరోగ్య అత్యవసరమైనా మీ జీవితాన్ని తలకిందులు చేయొచ్చు.

జీవన శైలిని మార్చొచ్చు. మానసిక ఒత్తిడిని పెంచొచ్చు. ప్రతీ వ్యక్తి తన వయసుతో సంబంధం లేకుండా ఆరోగ్య బీమా పథకాలను తీసుకోవాల్సిన అవసరాన్ని కొవిడ్‌ నొక్కి చెప్పింది.

ఒక వ్యక్తీ తనకు 30 ఏళ్లు వచ్చేలోగానే వ్యక్తిగత ఆరోగ్య బీమాను పొందాలి.

అంత తక్కువ వయసుకే ఎందుకు అని అనిపిస్తే.. ఇదిగో ఇవే ఆ కారణాలు..

తక్కువ ప్రీమియం వ్యయం..(Insurance)

ఏ ఆరోగ్య బీమాకైనా చిన్న వయసులోనే కొనుగోలు చేస్తే ప్రీమియం ఛార్జీలు తక్కువగానే ఉంటాయి.

మీకు 30 ఏళ్లు దాటితే ప్రీమియాలు పెరుగుతాయి.

Star Kisan Ghar : రైతులకు ఐటీ రిటర్న్స్ లేకుండానే 50లక్షల వరకు ఇంటి రుణం

Reliance : రిలయన్స్ ఇండ‌స్ట్రీస్ కీల‌క నిర్ణ‌యం

20ల్లో ఉండి.. ఆరోగ్యంగా ఉన్నాము అని భావిస్తే.. అదే బీమా కొనుగోలు చేయడానికి సరైన సమయం. ఎటువంటి క్రిటికల్‌ సమస్యలూ లేనపుడు మరింత తక్కువ ప్రీమియంకే బీమా వస్తుంది.

వేచిచూసే సమయాలు..(Insurance)

ఏ ఆరోగ్య బీమా కంపెనీకైనా తమ పథకాలకు కొన్ని వేచి చూసే సమయాలు ఉంటాయి.

వేర్వేరు ముందస్తు రోగాల (ప్రీ ఎగ్జిస్టింగ్‌ డిసీజెస్‌)కు వేర్వేరు వేచిచూసే సమయాలు ఉంటాయి.

ఇవి ఏడాది నుంచి రెండేళ్ల వరకు.. ఒక్కోసారి నాలుగేళ్ల వరకు ఉంటాయి. అత్యవసరంగా బీమా కావాలి అని అడిగినా.. ఈ వేచి చూసే సమయాన్ని తగ్గించలేరు.

Crypto currency : కోట్ల పన్ను ఎగవేత.. క్రిప్టోలపై కొనసాగుతున్న సోదాలు

Banking Rules : మారిన బ్యాంకుల రూల్స్​.. కొన్ని భారం.. మరికొన్ని మంచి..

కాబట్టి జీవితంలో ఎంత ముందుగా బీమా తీసుకుంటే.. అత్యవసరంలో అంత ఉపయోగపడుతుంది.

జీవన శైలి మార్పులు

పెరుగుతున్న కాలుష్య స్థాయిలకు తోడు ఆదుర్దా, ఆందోళన కారణంగా యువత సైతం జీవన శైలి రోగాలతో ఇబ్బంది పడుతున్నారు.

గుండె జబ్బులతో పాటు ఇతరత్రా రోగాలు వచ్చేస్తున్నాయి.

Mutual Funds : యాపిల్, టెస్లా లాంటి కంపెనీల షేర్లు కొంటారా

Industrial Development : పారిశ్రామిక అభివృద్ధిలో తెలంగాణ మొదటి స్థానం

ఇవి యువ జనాభాపై చాలా ప్రభావం చూపుతున్నాయి. కాబట్టి వీటన్నిటికీ సిద్ధంగా ఉండాలి.

భవిష్యత్‌ వైద్య చికిత్సలు, అత్యవసరాలకు ఇప్పటి నుంచే పెట్టుబడులు పెట్టడం చాలా మంచిది.

మెరుగైన ఆర్థిక ప్రణాళిక

20ల్లో లేదా 30లకు ముందు బీమా కొనుగోలు వల్ల మెరుగైన ఆర్థిక ప్రణాళికకు అవకాశం ఉంటుంది.

సంపాదించే డబ్బును సరిగ్గా నిర్వహించుకోవడం వల్ల జీవితాన్ని పూర్తిగా ఆస్వాదించుకోగలరు.

ముందస్తు హెచ్చరికలు లేకుండా జరిగే ప్రమాదాల గురించీ అర్థం చేసుకోవాలి.

అందుకు సరిపడా ఆరోగ్య కవరేజీ ఉంటే ఏ చింతా లేకుండా జీవించొచ్చు.

అంతకు మించి

సరైన విస్తృత ఆరోగ్య బీమా పథకం ఉంటే.. ఎవరైనా ఆసుపత్రులు, చికిత్స వ్యయాలకు నిధుల కోసం వెతుకులాడాల్సిన అవసరం ఉండదు.

పెరుగుతున్న ఆరోగ్య సంరక్షణ వ్యయాలను దృష్టిలో పెట్టుకుని అధిక స్థాయి రక్షణ ఉన్న పథకాలను ఎంచుకోవాలి.

Stock market | ముహూరత్ ట్రేడింగ్ కు ఎందుకు అంత ప్రాధ్యాన్యత

No Mask No Petrol : మాస్కులు లేకుంటే పెట్రోల్ పోయ‌రు

ప్రధాన రోగాలన్నీ బీమా పరిధిలోకి వచ్చేలా చేసుకోవాలి.

భారత్‌, విదేశాల్లో రూ.50 లక్షల నుంచి రూ.3 కోట్ల వరకు కవరేజీ ఉండే పథకాలూ ఉన్నాయి.

ఇవి ఆధునిక, అత్యాధునిక చికిత్సలనూ అందిస్తాయి.

ప్రస్తుత ఆరోగ్య సంరక్షణ అవసరాలే కాకుండా.. జీవితకాలంలో వివిధ దశల్లో వచ్చే అవసరాలనూ ఇవి తీరుస్తారు.

ప్రీమియం పథకాల వల్ల లాయల్టీ డిస్కౌంట్లతో పాటు బీమా చేసిన ప్రాథమిక విలువపై అపరిమిత రీస్టొరేషన్‌ సైతం లభిస్తుంది.

ఆరోగ్య బీమాలో విశ్లేషకులు చెప్పేదొకటే.. ‘ఎంత త్వరగా బీమా కొంటే అంతకు మించిన ప్రయోజనాలు అందుతాయి. మరి ఎందుకు ఆలస్యం చేయడం’ అని.

Online Tracking : గూగుల్‌, ఫేస్‌బుక్‌కు 1,685 కోట్ల జరిమానా

Omicron Alert : ఒమిక్రాన్‌కు మ‌రో రెండు కొత్త లక్షణాలు..

Recent

- Advertisment -spot_img