Homeలైఫ్‌స్టైల్‌అధిక బరువుకు ఈ అలవాట్లూ కారణమే

అధిక బరువుకు ఈ అలవాట్లూ కారణమే

సమయానికి తినక పోవడం, తిన్నా బ్రేక్‌ఫాస్ట్‌ ఎగ్గొట్టడం వల్ల శరీరానికి అభద్రత పెరుగుతుంది. కొవ్వు రూపంలో శక్తిని నిల్వ చేసుకుంటుంది. ఫలితంగా బరువు పెరుగుతుంది.

రెండు భోజనాలమధ్య విరామం గరిష్ఠంగా ఐదు గంటలకు మించకూడదు. తేడా పెరిగే కొద్దీ ఎసిడిటీ పెరుగుతుంది. ఫలితంగా బరువూ అధికం అవుతుంది.

మరొకటి అతితిండి సమస్య. రోజంతా ఏదో ఒకటి నములుతూ ఉండటం. దీంతో అజీర్తి పెరిగిపోతుంది. ఇది ఊబకాయానికి దారితీస్తుంది. రెండు భోజనాలమధ్య విరామం కనీసం రెండు గంటలైనా ఉండాలి.

మలబద్ధకం కూడా ఊబకాయానికి కారణమే.

చక్కెర, మైదా, వేపుళ్లు, జంక్‌ ఫుడ్‌లకు పూర్తిగా దూరం వుండాలి.

హార్మోన్ల సమస్యలు, తగినన్ని నీళ్లు తాగక పోవడం కూడా కారణాలే.

విటమిన్‌ బి-12, డి-3 లోపాలు కూడా బరువును పెంచుతాయి.

Recent

- Advertisment -spot_img