Homeలైఫ్‌స్టైల్‌Headache : తలనొప్పిని క్షణాల్లో తగ్గించే ఇంటి చిట్కాలు

Headache : తలనొప్పిని క్షణాల్లో తగ్గించే ఇంటి చిట్కాలు

Headache : తలనొప్పిని క్షణాల్లో తగ్గించే ఇంటి చిట్కాలు

Headache : తలనొప్పి.. చిన్న సమస్యే అయినప్పటికీ.. ఒక్కోసారి భరించలేనంత భయంకరంగా ఉంటుంది.

ఒత్తిడి, నిద్రలేమి, టెన్షన్ ఇలా ఇతరితర కారణంగా తలనొప్పి వస్తుంటుంది.

తలనొప్పి మొదలైతే.. ఇక మరేపనిపై దృష్టి సారించలేరు.

అందుకే తలనొప్పి వచ్చిన వెంటనే.. దాన్ని తగ్గించుకునేందుకు ట్యాబ్లెట్స్ వేసేసుకుంటారు.

కానీ, ఇలా చేడయం వల్ల భవిష్యత్తులో అనేక అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.

అందుకే సహజంగానే తలనొప్పిని నివారించుకోవాలి.

అయితే ఇప్పుడు చెప్పబోయే హోమ్ రెమెడీస్ ఫాలో అయితే క్షణాల్లో తలనొప్పికి చెక్ పెట్టవచ్చు.

అందులో ముందుగా.. ఒక గ్లాస్ గోరువెచ్చటి పాలలో చిటికెడు పసుపు కలిపి తాగాలి.

ఇలా చేయడం వల్ల తలనొప్పి నుంచి క్షణాల్లో ఉపశమనం పొందొచ్చు.

తలనొప్పిని తగ్గించడంలో వెల్లుల్లి కూడా గ్రేట్‌గా సహాయపడుతుంది.

ముందుగా వెల్లుల్లి తీసుకుని రసం తీసుకోవాలి. ఈ రసాన్ని ఒక టీ స్పూన్ తీసుకోవాలి.

ఇలా చేయడం వల్ల తలనొప్పి తగ్గుతుంది. శరీరంలో నీటి శాతం తగ్గడం వల్ల కూడా తలనొప్పి వస్తుంటుంది.

అందుకే ప్రతి రోజు వీలైనన్ని ఎక్కువ నీళ్లు తాగుతూ ఉండాలి.

అలాగే తల నొప్పి ఎక్కువగా ఉన్న సమయంలో గోరువెచ్చటి నీటితో తల స్నానం చేస్తే.. క్షణాల్లో రిలీఫ్ అవ్వొచ్చు.

తలనొప్పి వస్తున్న సమయంలో జీడిపప్పు, బాదంపప్పు ఇలా నట్స్ తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం ఉంటుంది.

ఇక గోరువెచ్చని నీటిలో అల్లం రసం కలుపుకుని తాగినా.. తలనొప్పి తగ్గుముఖం పడుతుంది.

ఇవి కూడా చ‌ద‌వండి

తరచుగా తలనొప్పి బాధిస్తుందా.. మైగ్రేన్‌, సైనస్ కావొచ్చు

మైగ్రేన్‌ తలనొప్పికి కారణాలు.. చికిత్స..

Recent

- Advertisment -spot_img