ఇదే నిజం, ఆసిఫాబాద్ టౌన్ : ఆసిఫాబాద్ మండలం బాబాపుర్ గ్రామంలో అగ్ని ప్రమాదం సంభవించింది. ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కావల్కర్ లక్ష్మీ బాయ్ ,కావల్కర్ సురేష్ కు చెందిన రెండు ఇల్లులు పూర్తిగా కాలిపోయాయి. భారీగా ఆస్తి నష్టం జిరిగినట్లు స్థానికులు తెలిపారు. గ్యాస్ సిలిండర్ పేడటం వల్ల ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.