నందమూరి బాలకృష్ణ హోస్టుగా చేస్తున్న ప్రముఖ టాక్ షో ‘అన్‌స్టాపబుల్ సీజన్ 4’ ప్రారంభమైంది. తాజాగా తొలి ఎపిసోడ్ అతిథిగా ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు వచ్చారు. దీనికి సంబంధించిన ప్రోమోని విడుదల చేసింది ‘ఆహా’ యూనిట్. ఈ షోలో అన్నీ నిజాలే మాట్లాడ్లని చంద్రబాబుతో బాలకృష్ణ ప్రమాణం చేయించారు. జైలులో తన మొదటి రాత్రి ఎలా గడిచింది అన్న ప్రశ్నకు …భావోద్వేగానికి గురయ్యారు చంద్రబాబు. తప్పు చేసిన వారిని వదిలిపెట్టేది లేదని చంద్రబాబు అన్నారు. జైలు గోడల మధ్య బాబు, పవన్ మధ్య ఏం జరిగిందన్న ప్రశ్నకు చంద్రబాబు సమాధానం ఆసక్తికరంగా మారింది. థింక్ గ్లోబలీ.. యాక్ట్ గ్లోబల్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నట్లు చంద్రబాబు ఈ సందర్భంగా తెలిపారు. ప్రస్తుతం ఈ ప్రోమో ప్రస్తుత తెగ వైరల్ అవుతోంది.