Important instruction before wrote Promissory Note : ప్రామిసరీ నోటు మీద ఈ ఒక్కటి రాస్తే అప్పు ఇచ్చిన వాడు చచ్చినా మీ డబ్బు వెనక్కి వస్తుంది..
ఇద్దరు వ్యక్తుల మధ్య నగదు మారకం జరిగినప్పుడు ప్రామిసరి నోటు(Promissory Note) అవసరం ఏర్పడుతుంది.
ఒకప్పుడు ఒక వ్యక్తి మరో వ్యక్తికి నగదును అప్పుగా ఇచ్చినప్పుడు షూరిటీగా ఓ పత్రాన్ని రాసుకునేవారు.
అప్పు తీసుకున్న వ్యక్తి నగదు ఇవ్వనప్పుడు దీనిని సాక్ష్యంగా చూపుతారు.
అయితే రానున్న రోజుల్లో వ్యక్తుల మధ్య సంబంధాలు సక్రమంగా లేకపోవడంతో ప్రామిసరి నోటును అందుబాటులోకి తెచ్చారు.
అయితే కొందరు ప్రామిసరి నోటుపై అప్పు తీసుకున్న వ్యక్తి సంతకం తీసుకుంటారు.
కానీ అప్పు తీసుకున్న వ్యక్తి తిరిగి నగదు ఇవ్వనప్పుడు అనేక సమస్యలు ఎదురయ్యే అవకాశాలున్నాయి.
ముఖ్యంగా ఈ క్రమంలో కొందరు రాంగ్ సిగ్నేచర్ కూడా పెట్టే అవకాశం ఉంది.
అయితే ఇలాంటి సమయంలో ఎలా జాగ్రత్తగా ఉండాలి..? ప్రామిసర్ నోటు రాసేటప్పుడు సంతకం కాకుండా ఇంకేం చేయాలి..?
రాజు అనే వ్యక్తి నుంచి శివ అనే అతను అప్పుడు తీసుకున్నాడనుకుందాం.
ఈ సమయంలో శివకు అప్పు ఇచ్చినందుకు ఓ ప్రామిసరి నోటుపై వివరాలు రాసి అతని సంతకం తీసుకుంటారు.
అలాగే కొందరు సాక్ష్యుల సంతకం కూడా తీసుకుంటారు.
అయితే శివ రాము అనుకున్న సమయానికి లేదా.. మొత్తానికే డబ్బు ఇవ్వనని చెబితే రాజు ఇబ్బంది పడుతాడు.
దీంతో ఆయన ప్రామిసర్ నోటుపై సంతకం ఆధారంగా కోర్టులో కేసు వేయవచ్చు.
అయితే శివ తెలివిగా ముందుగానే రాంగ్ సిగ్నేచర్ పెట్టాడు.
దీంతో రాజు కోర్టుకు వెళ్లినా ఆ సంతకం తనని కాదనే అవకాశం ఉంది.
ఈ పరిస్థితుల్లో అప్పు ఇచ్చిన వ్యక్తి తీవ్ర ఇబ్బందుల్లో పడే ప్రమాదం ఉంది.
ఇలాంటి సమయంలో ఎదుటి వ్యక్తికి అప్పు ఇచ్చేటప్పుడు సంతకం కాకుండా వేలిముద్రలు తీసుకోవడం బెటరని న్యాయ నిపుణులు సూచిస్తున్నారు.
సంతకం గ్యాంబ్లింగ్ చేయొచ్చుగానీ.. వేలిముద్రలతో ఎవరినీ మోసం చేసే అవకాశం లేదంటున్నారు. (Promissory Note)
ఇక ప్రామిసరి నోటు రాసేటప్పుడు కచ్చితంగా సాక్ష్యుల సంతకం తీసుకోవాల్సిన అవసరం ఉంది.
వారివి కూడా వేలు ముద్రలు మాత్రమే తీసుకుంటే మంచిదని సూచిస్తున్నారు.
ఒక కంపెనీ లేదా ఫైనాన్స్ సంస్థ లోన్ ఇవ్వాలంటే చెక్స్, ప్రామిసరి నోటును బేస్ చేసుకుంటాయి.
ఎలాంటి షూరిటీలు ఉన్నా ప్రామిసరి నోటు ను కంపల్సరీగా పెట్టుకోవాలంటున్నారు.
మిగతా డాక్యుమెంట్స్ పై లోన్, లేదా అప్పు తీసుకున్నా వాటిపై కాల పరమితి లేదు.
కానీ ప్రామిసరి నోటుపై నగదు అప్పు తీసుకుంటే కచ్చితంగా 3 సంవత్సరాల లోపు చెల్లించాల్సి ఉంటుంది.
మూడేళ్లలోపల నగదు తీసుకున్న వ్యక్తి చెల్లించకపోతే వారు అప్పు ఇచ్చిన వ్యక్తి కోర్టుకు వెళ్లే అవకాశం ఉంటుంది.
దానిని కోర్టు పరిగణలోకి తీసుకుంటుంది. 3 సంవత్సరాలు దాటిన తరువాత కోర్టుకు వెళ్లినా ప్రయోజనం ఉండదు.
ఇక ప్రామిసరి నోటు రాయడానికి ఒక స్టాండర్ట్ ఫార్మాట్ఉంది.
డబ్బులు ఇచ్చే వ్యక్తి, తీసుకున్న వ్యక్తి పేర్లు వివరాలు ఉండాలి.
అలాగే డబ్బులు తీసుకున్న వ్యక్తి రెవెన్యూ స్టాంపుపై సిగ్నేచర్ ఉండాలి.
అయితే ఈ ప్రామిసరి నోటను ఎవరు రాస్తున్నారో వారి సంతకం కూడా ఉండాల్సిన అవసరం ఉంది.
ఇలా ఓ ఫార్మాట్ లో తయారైన ప్రామిసరి నోటు ప్రకారం అప్పు తీసుకున్న వ్యక్తి నిర్ణీత సమయంలో డబ్బులు చెల్లించకపోతే అప్పు ఇచ్చిన వ్యక్తి మూడు సంవత్సరాల లోపు కోర్టుకు వెళ్లవచ్చు.
తన పేరు మీద సమ్ అమౌంట్ కట్టి కేసు ఫైల్ చేయవచ్చు.
దీని ద్వారా డబ్బు తీసుకున్న వ్యక్తి నుంచి అమౌంట్ తో పాటు ఇంట్రెస్టు, కోర్టు ఖర్చులు కూడా రాబట్టుకునే అవకాశం ఉంటుంది.