తెలంగాణలో వచ్చే నెల 6 నుంచి ప్రారంభంకానున్న కులగణనకు టీచర్లను వినియోగించుకోవాలని కలెక్టర్లను డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశించారు. మంగళవారం కలెక్టర్లతో వీడియోకాన్ఫరెన్స్ లో మాట్లాడారు. స్కూల్ ముగిసిన తర్వాత ఒక్కో ఉపాధ్యాయుడు రోజుకు 5-7 ఇళ్లలో వివరాలు సేకరించాలని చెప్పారు. ఇందులో పాల్గొనే ఎన్యుమరేటర్లు, సూపర్వైజర్లకు మంచి వేతనం ఇస్తామని తెలిపారు. ప్రజలను అడగాల్సిన 50 ప్రశ్నలపై పూర్తి అవగాహన కల్పించాలని భట్టి సూచించారు.