ఉత్తరప్రదేశ్ ఆగ్రాలో ముగ్గురు చెప్పుల వ్యాపారుల ఇంట్లో గుట్టలుగుట్టలుగా నగదు పట్టుబడింది. ఆదాయ పన్ను ఎగవేస్తూ వ్యాపారం నిర్వహిస్తున్నారన్న పక్కా సమాచారంతో ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులు సోదాలు నిర్వహించారు. వాళ్ల ఇళ్లల్లో గుట్టలుగుట్టలుగా ఉన్న రూ.500 నోట్ల కట్టలు చూసి అధికారులు షాక్ అయ్యారు. ఇప్పటివరకూ లెక్కించిన నగదు విలువ దాదాపు రూ. 40 కోట్లుగా అధికారులు పేర్కొన్నారు. ఇది ఇంకా పెరిగే అవకాశం ఉంది. చెప్పుల వ్యాపారుల వద్ద ఇంత మొత్తంలో నగదు ఎక్కడిది అనే కొణంలో విచారణ ప్రారంభించారు.