ఉలగనాయగన్ కమల్‌హాసన్ హీరోగా, శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన భారీ చిత్రం “భారతీయుడు 2”. ఈ చిత్రం భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా లెవెల్‌లో శుక్రవారం ప్రేక్షకుల ముందుకొచ్చింది. సిల్వర్ స్క్రీన్‌పై ఆల్ టైమ్ సూపర్ హిట్ బ్లాక్ బస్టర్ కాంబోలో వచ్చిన భారతీయుడు 2 ఎలా ఉందో తెలుసుకుందాం..
కథ:
శంకర్ స్టైల్‌లో అవినీతి అంశాల చుట్టూ తిరిగే సన్నివేశాలతో మొదలవుతుంది. భారతీయుడు 2. మెల్లగా సిద్దార్థ్ సింపుల్ ఇంట్రడక్షన్‌తో సిల్వర్ స్క్రీన్‌పైకి ఎంట్రీ ఇస్తాడు. దేశవ్యాప్తంగా అవినీతి రోజురోజుకీ ఎలా పెరిగిపోతుందో తెలియజేసేలాసిద్దార్థ్ అండ్ గ్యాంగ్ సోషల్ మీడియాలో వీడియోలు చేస్తూ ప్రజలకు అవగాహన కల్పించే ప్రయత్నం చేస్తుంటారు. అటు నుంచి రకుల్ ప్రీత్ సింగ్ పరిచయం ఉంటుంది. కట్ చేస్తే.. కథ తైవాన్‌కు మారిపోతుంది.
ఇక మొదటి సాంగ్ టైం.. క్యాలెండర్ సాంగ్‌తో బాలీవుడ్ యాక్టర్ గుల్షన్ గ్రోవర్ స్టైలిష్ ఎంట్రీ ఇస్తాడు. అసలు ఇండియన్ 2ఎంట్రీ ఎప్పుడెప్పుడు ఉంటుందా..? అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం ఉలగనాయగన్ వస్తాడు. సేనాపతిగా ఎంట్రీ ఇచ్చిన కమల్ హాసన్ మార్షల్ ఆర్ట్స్‌లో స్కిల్స్‌ను సిల్వర్ స్క్రీన్‌పై ప్రజెంట్ చేసే సన్నివేశాలుంటాయి.
ఇక అవినీతి రాజ్యమేలుతున్న భారతదేశంలోకి సేనాపతి ప్రవేశం అనివార్యమైన సందర్భంలో ఇండియాలో ల్యాండింగ్ అవుతాడు సేనాపతి. ఇప్పుడు సేనాపతిగా టైటిల్ రోల్‌ను ఎలివేట్ చేసేలా తాత వస్తడే సాంగ్ ఉంటుంది. శంకర్ మార్క్ విజువల్స్‌తో గ్రాండ్‌గా సాగే ఈ పాట సినిమాకు హైలెట్‌గా చెప్పొచ్చు. అనంతరం సిద్దార్థ్ అండ్ గ్యాంగ్‌పై వచ్చే కొన్ని సన్నివేశాలుంటాయి.
ఇక బాబీ సింహా చుట్టూ తిరిగి ఇన్వెస్టిగేటివ్ సన్నివేశాలతో సెకండాఫ్ షురూ అవుతుండగా.. మరోవైపు రకుల్ ప్రీత్ సింగ్ ఫ్యామిలీ సీన్లు వస్తాయి. అప్పటిదాకా ఒక మాదిరిగా సాగిన కథ కొంచెం సీరియస్ మూడ్‌లో వచ్చేస్తుంది. ఇక్కడే తెలుగు వెర్షన్‌లో రాంచరణ్ అభిమానులకు ఒక సర్‌ప్రైజ్ ఉంటుంది. కొన్ని భావోద్వేగ సన్నివేశాల తర్వాత కీలక మలుపు ఎంటో తెలుస్తోంది. కమల్ హాసన్ చేజింగ్ సీక్వెన్స్, ముష్కరమూకలతో ఫైట్ సీక్వెన్స్ వన్ మ్యాన్ షోలా సాగుతుంది. చిన్నపాటి ట్విస్ట్ ఇస్తూ ఊహించని విధంగా సినిమాకు శుభం కార్డు పడుతుంది.
నటీనటులు:
సేనాపతి పాత్రలో ముఖాన్ని ప్రోస్థెటిక్ మేకప్ కప్పేసినా కమల్ హాసన్ హావభావాలు పలికించగలిగాడు. తన బాడీ లాంగ్వేజ్ తోనే ఆ పాత్రకు ఒక ప్రత్యేకత తీసుకొచ్చాడు. ఆ పాత్రతో ప్రేక్షకులకు ఏర్పడ్డ ఎమోషనల్ కనెక్ట్ కూడా దాన్ని ఓన్ చేసుకోవడానికి ఉపయోగపడింది. సిద్ధార్థ్ అరవింద్ పాత్రలో బాగానే చేశాడు. అతడికి జోడీగా నటించిన రకుల్ ప్రీత్ పాత్ర నామమాత్రం. తన స్క్రీన్ ప్రెజెన్స్ బాగుంది. సిద్ధు స్నేహితులుగా ప్రియ భవానీ శంకర్.. జగన్.. మరో నటుడు బాగానే చేశారు. విలన్ పాత్రలో ఎస్.జె.సూర్యకు పార్ట్-2లో చెప్పుకోదగ్గ రోల్ లేదు. అతను పార్ట్-3లో హైలైట్ అవుతాడని ముందే చెప్పిన సంగతి తెలిసిందే. సీబీఐ అధికారి పాత్రలో బాబీ సింహా పర్వాలేదు. సముద్రఖని బాగా చేశాడు. ఈ సినిమా మేకింగ్ దశలో ఉండగానే చనిపోయిన వివేక్.. నెడుముడి వేణు.. మనోబాల.. ప్రత్యేకతేమీ కనిపించలేదు సినిమాలో.
సాంకేతిక విభాగం:
ఈ సినిమాలో సాంకేతిక విభాగం వర్క్ చాలా బాగుంది. అనిరుధ్ రవిచందర్ సంగీతం సినిమాకు ప్లస్ కాలేదు. రవి వర్మన్ సినిమాటోగ్రఫీ మాత్రం సినిమాకే హైలెట్ గా నిలుస్తోంది. కొన్ని కీలక సన్నివేశాల్లో కెమెరామెన్ పనితనం చాలా బాగుంది. ఎడిటర్ ఎ. శ్రీకర్ ప్రసాద్ ఎడిటింగ్ బాగుంది. సినిమాలోని నిర్మాతలు సుభాస్కరన్ అల్లిరాజా, ఉదయనిధి స్టాలిన్ పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ అద్భుతంగా ఉన్నాయి దర్శకుడు ఎస్. శంకర్ దర్శకత్వ పరంగా మాత్రం చాలా బాగా ఆకట్టుకున్నారు. రచన పరంగా మాత్రం ఆకట్టుకోలేకపోయారు.
ప్లస్ పాయింట్స్:
కమల్ హాసన్ నటన, ప్రొడక్షన్ విలువలు
మైనస్ పాయింట్స్:
భారతీయుడు లుక్, బలహీనమైన స్క్రీన్ ప్లే, ఎమోషనల్ కనెక్ట్ లేకపోవడం, మొదటి సినిమాలా పవర్ ఫుల్ సీక్వెన్స్ లేకపోవడం
చివరిగా:
కమల్ హాసన్, సిద్దార్థ్ అండ్ గ్యాంగ్ సన్నివేశాలతో ఒకే అన్నట్టుగా సాగుతుంది. కొన్ని సన్నివేశాలు బాగానే వర్కవుట్ అయినా.. మరికొన్ని సీన్లు మాత్రం ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఫెయిలయ్యాయనే భావన ప్రేక్షకుల్లో కలుగుతుంది. ఫైనల్ గా ఈ చిత్రం కొన్నిచోట్ల మాత్రమే మెప్పిస్తుంది.
రేటింగ్: 2.5/5