Bollywood Latest News : బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ తన ఇన్‌స్టాగ్రాం అకౌంట్‌లో ఉన్న పెళ్లి ఫొటోలను డిలీట్ చేశారు. రణ్‌వీర్, దీపిక పెళ్లి ఫొటోలు కనబడపోయేసరికి ఫ్యాన్స్ ఆశ్చర్యానికి గురవుతున్నారు. త్వరలో వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారన్న రూమర్స్ స్ప్రెడ్ అవుతున్నాయి. గతంలో టాలీవుడ్ హీరో నాగచైతన్య ఈ విధంగానే పోస్టులు డిలీట్ చేసి విడాకులు తీసుకున్నారు. ఈ క్రమంలో రణ్‌వీర్ చేసిన ఈ పనికి కారణం ఏమయి ఉంటుందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం దీపికా పదుకొణె ప్రెగ్నెన్సీతో ఉంది. ఈ టైంలో విడాకులు తీసుకోబోరని కొందరు అనుకుంటున్నారు.