Homeహైదరాబాద్latest Newsబుజ్జిగాడు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా.. ఈ సారైనా పూరి కంబ్యాక్ ఇస్తాడా..!

బుజ్జిగాడు కాంబినేషన్ మళ్ళీ రిపీట్ కాబోతుందా.. ఈ సారైనా పూరి కంబ్యాక్ ఇస్తాడా..!

సెన్సషనల్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తన సినిమాలతో ఎన్నో బ్లాక్ బస్టర్ హిట్స్ ఇచ్చాడు. అతనితో సినిమా చేయడానికి స్టార్ హీరోలు వెయిట్ చేసెవారు. ఒకప్పుడు పూరీ జగన్నాథ్ టాలీవుడ్ నే శాసించాడు. తాజాగా ఈ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌తో పూరీ మరోసారి పని చేయబోతున్నాడనే అనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతుంది. అయితే గతంలో వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన ‘బుజ్జిగాడు’ మంచి విజయం సాధించింది. ఆ తరువాత వచ్చిన ‘ఏక్ నిరంజన్’ సినిమా మాత్రం నిరాశపరించింది.అయితే చాలా ఏళ్ల తర్వాత వీరిద్దరు ఒక సినిమా కోసం కలవబోతున్నారు. ఆ సినిమా ఏదో కాదు సందీప్ రెడ్డి వంగ డైరెక్షన్లో ప్రభాస్ హీరోగా నటిస్తున్న ‘స్పిరిట్’. ఈ సినిమాకు పూరి డైలాగ్స్ రాస్తున్నాడు. పోలీస్ జోనర్‌లో తెరకెక్కుతున్న స్పిరిట్ సినిమాకు డైలాగ్స్ రాయాలని దర్శకుడు సందీప్ రెడ్డి వంగా ఇటీవల పూరీని సంప్రదించినట్లు సినీ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనికి పూరి కూడా గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చినట్టు తెలుస్తుంది. ఇదే నిజమైతే గతంలో పూరి, ప్రభాస్ కాంబోలో వచ్చిన సినిమా డైలాగ్స్ ఎంత పాపులర్ అయ్యాయో తెలిసిందే.

Recent

- Advertisment -spot_img