Jio 6G : త్వరలో భారత్‌లో జియో 6జీ సేవలు
Jio 6G : ప్రస్తుతం మనం 5జీ టెక్నాలజీలో ఉన్నాం.
ప్రపంచవ్యాప్తంగా 5జీ టెక్నాలజీ పూర్తిస్థాయిలో రాకున్నా.. దానికంటే ముందే 6జీ టెక్నాలజీపై రిలయెన్స్ జియో కసరత్తు చేస్తోంది.
ఇప్పుడిప్పుడే 5జీ అన్ని దేశాల్లో విస్తరిస్తుండగా.. 5జీ కంటే ముందే 6జీ టెక్నాలజీని భారత్‌లో తీసుకొచ్చేందుకు జియో కృషి చేస్తోంది.
దానిలో భాగంగానే యూరప్‌లోని ఫిన్లాండ్‌లో ఉన్న ఓలు యూనివర్సిటీతో జియో ఒప్పందం చేసుకుంది.
జియోకు యూరప్‌లోని ఎస్టోనియా అనే దేశంలో రీసెర్చ్ యూనిట్ ఉంది.
ఆ రీసెర్చ్ యూనిట్.. ఓలు యూనివర్సిటీతో కలిసి 6జీ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌లో భాగం కానుంది.
Robots : ఈ రోబో మనిషి మెదడునే చదివేస్తుంది
E Passport | ఇక దొంగ పాస్‌పోర్ట్‌లకు చెక్
ఈ ఒప్పందంలో భాగంగా 5జీ టెక్నాలజీ సేవలను విస్తరించడంతో పాటు 6జీ టెక్నాలజీపై రీసెర్చ్ చేయనున్నారు.
ఇప్పటికే ఓలూ యూనివర్సిటీ 6జీ టెక్నాలజీపై వర్క్ చేస్తోంది.
ప్రపంచంలోనే 6జీ రీసెర్చ్ ప్రోగ్రామ్‌ను నిర్వహిస్తున్న తొలి యూనివర్సిటీ అది.
అందుకే.. జియో ఆ యూనివర్సిటీతో టైఅప్ అయింది.
ఇయో ఎస్టోనియా, రిలయెన్స్ గ్రూప్‌తో కలిసి పనిచేసేందుకు మేము చాలా ఆసక్తిగా ఉన్నాం.
6జీ టెక్నాలజీపై రీసెర్చ్ కోసం జియో ఎస్టోనియా రీసెర్చ్ విభాగం మాకు చాలా ఉపయోగపడుతుంది.
దాని వల్ల.. భవిష్యత్తులో యూజర్ల అవసరాలను అనుగుణంగా వైర్‌లెస్ టెక్నాలజీ ద్వారా పరిష్కారం చూపడం కోసం జియోతో కలిసి పనిచేస్తాం..
WhatsApp DP : వాట్సాప్ డీపీలుగా సొంత ఫోటోలు పెడుతున్నారా
Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా
అని ఓలు యూనివర్సిటీకి చెందిన 6జీ టెక్నాలజీ మీద పనిచేసే ప్రొఫెసర్ మాటీ లాట్వీ ఆహా వెల్లడించారు.
5జీ టెక్నాలజీని బేస్ చేసుకొని 6జీ టెక్నాలజీని అభివృద్ధి చేస్తామని..
దానిలో భాగంగా డిజిటలైజేషన్‌ను విస్తరిస్తామని..
5జీతో పాటు 6జీ సేవలు కూడా కొనసాగుతాయని దాని వల్ల ఎక్కువ మంది యూజర్లకు ఈ సేవలు అందుతాయని యూనివర్సిటీ స్పష్టం చేసింది.
6జీ టెక్నాలజీ వల్ల స్పేస్, ఏరియల్ కమ్యూనికేషన్, హోలోగ్రాఫిక్ బీమ్‌ఫామింగ్, సైబర్ సెక్యూరిటీలో 3డీ కనెక్టెడ్ ఇంటెలిజెన్స్, మైక్రో ఎలక్ట్రానిక్స్, ఫోటానిక్స్ లాంటి సేవలు మెరుగ్గా పనిచేయడంతో పాటు వాటి పరిధిని విస్తరించుకోనున్నాయి.
భారత్‌లో ఉన్న 400 మిలియన్(40 కోట్లు) సబ్‌స్క్రైబర్లకు పెద్ద మొత్తంలో డేటాను ట్రాన్స్‌మిట్ చేయడం అనేది చాలా కష్టంతో కూడుకున్న పని.
దానికోసమే.. 6జీ టెక్నాలజీ డెవలప్‌మెంట్‌పై దృష్టి పెడుతున్నాం.
దాని వల్ల డేటాను ట్రాన్స్‌మిషన్ అనేది సులభం అవుతుంది, స్పీడ్ పెరుగుతుంది.. అని జియో ఎస్టోనియా సీఈవో టావీ కోట్కా వెల్లడించారు.
Solar Tsunami : భూమికి పొంచి ఉన్న సౌర తుఫాను ప్రమాదం
Never Search In Google: గూగుల్‌లో సెర్చ్ చేయకూడని పదాలు..