Homeఫ్లాష్ ఫ్లాష్Jio Phone Next : దీపావళికే మార్కెట్‌లోకి జియోఫోన్‌ నెక్స్‌..

Jio Phone Next : దీపావళికే మార్కెట్‌లోకి జియోఫోన్‌ నెక్స్‌..

Jio Phone Next arriving in market on diwali : దీపావళికే మార్కెట్‌లోకి జియోఫోన్‌ నెక్స్‌..

రిలయన్స్‌ జియో సంచలన 4జీ స్మార్ట్‌ఫోన్‌.. జియోఫోన్‌ నెక్స్‌ దీపావళికే మార్కెట్‌లోకి విడుదల అవుతుందని గూగుల్‌ సీఈవో, భారత సంతతి టెక్కీ సుందర్‌ పిచాయ్‌ ప్రకటించారు.

గూగుల్‌ మాతృ సంస్థ అల్ఫాబెట్‌ ఆర్థిక ఫలితాల సందర్భంగా బుధవారం పిచాయ్‌ ఈ మేరకు స్పష్టం చేశారు.

జియోఫోన్‌ నెక్స్ట్‌ ను జియో, గూగుల్‌ కలిసి తయారు చేస్తున్న విషయం తెలిసిందే.

నిజానికి ఇప్పటికే అందుబాటులోకి రావాల్సి ఉన్న ఈ మొబైల్‌కు.. సెమికండక్టర్‌ (చిప్‌)ల కొరత అడ్డుపడింది.

కాగా, ఈ ఫోన్‌లోని ట్రాన్స్‌లేషన్‌ ఆప్షన్‌.. వినియోగదారులకు ఎంతగానో లాభించగలదన్న విశ్వాసాన్ని పిచాయ్‌ వ్యక్తం చేశారు.

ఇప్పటికే ఫోన్‌లోని ఫీచర్లు, కొన్ని విశేషాలు బయటకు రాగా, దేశంలోని సుమారు 30 కోట్ల 2జీ కస్టమర్లే లక్ష్యంగా వస్తున్న ఈ చౌక స్మార్ట్‌ఫోన్‌ ధర దాదాపు రూ.5,000లుగా ఉండొచ్చన్న అంచనాలు మార్కెట్‌లో వినిపిస్తున్నాయి.

జియోఫోన్‌ నెక్స్ట్‌ ఫీచర్స్‌?

  • 5.5 అంగుళాల హెచ్‌డీప్లస్‌ డిస్‌ప్లే
  • 2జీబీ, 3జీబీ ర్యామ్‌ వేరియంట్స్‌
  • 16జీబీ, 32జీబీ స్టోరేజీ ఆప్షన్లు
  • ఎస్‌డీ కార్డుతో స్టోరేజీ పెంచుకునే వీలు
  • 13 మెగాపిక్సల్‌ బ్యాక్‌, 8ఎంపీ ఫ్రంట్‌ కెమెరాలు
  • 2,500 మెగాహెట్జ్‌ బ్యాటరీ
  • స్నాప్‌డ్రాగన్‌ 215 చిప్‌
  • మైక్రో-యూఎస్‌బీ పోర్ట్‌తో చార్జింగ్‌

Recent

- Advertisment -spot_img