Kidney Stones : టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయా ?
Kidney Stones with tomato : మార్కెట్‌లో మనకు సులభంగా లభించే అనేక రకాల కూరగాయల్లో టమాటాలు కూడా ఒకటి.
వీటిని మనం ఎంతో కాలంగా అనేక రకాల వంటకాల్లో ఉపయోగిస్తున్నాం.
వీటితో కూరలు, సలాడ్లు, చారు, సూప్స్, ఇతర వంటకాలు చేసుకుంటారు.
అయితే నిత్యం మనం చేసుకునే ఏ కూరలో అయినా సరే టమాటాలు పడకపోతే వాటికి సరైన రుచి రాదు.
ఇక వీటిలో యాంటీ ఆక్సిడెంట్లు, విటమిన్లు, మినరల్స్, ఫైబర్ వంటి మన శరీరానికి అవసరమయ్యే పోషకాలు కూడా పుష్కలంగా ఉంటాయి.
అందుకనే టమాటాలను నిత్యం మనం వంటల్లో వేస్తుంటాం.
అయితే టమాటాలను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయని చాలా మంది అంటుంటారు.
అనడమే కాదు.. కొందరు వైద్యులు కూడా ఇదే మాట చెబుతుంటారు.
అయితే ఇంతకీ ఇందులో నిజమెంత ఉంది ? నిజంగానే టామాటాలను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు వస్తాయా ? అంటే…
Chicken : చికెన్‌ను స్కిన్‌తో తింటే మంచిదా.. కాదా..
Best Diet : మంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్రపంచంలో మంచి డైట్
కిడ్నీ స్టోన్లు అనేవి నిజానికి రాత్రికి రాత్రే ఏర్పడవు.
అవి ఏర్పడేందుకు కొన్ని నెలలు లేదా సంవత్సరాలు పట్టవచ్చు.
కిడ్నీల్లో జరిగే ప్రెసిపిటేషన్ అనే ప్రక్రియ వల్ల కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయి.
సహజంగా మనం తినే ఆహారాల్లో ఉండే మినరల్స్, ఆగ్జలేట్స్, కాల్షియంలు కిడ్నీల్లోని యూరిక్ యాసిడ్‌తో కలిసి కిడ్నీ స్టోన్లుగా ఏర్పడుతాయి.
ఇందుకు కొన్ని నెలల సమయం పడుతుంది.
చిన్న చిన్న స్ఫటికాలుగా రాళ్లు తయారై అవి రాను రాను పెద్ద సైజులోకి మారుతాయి.
అప్పుడే వాటిని మనం గుర్తిస్తాం. ఆ సమయంలో రాళ్లు మూత్రాశయానికి అడ్డుపడి మూత్రం రాకుండా చేస్తాయి.
దీంతో విపరీతమైన, భరించలేని నొప్పి కలుగుతుంది.
అయితే ఒకసారి స్టోన్లు వచ్చి తొలగిపోయిన వారికి మళ్లీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం చాలా ఎక్కువగా ఉంటుందని వైద్యులు చెబుతున్నారు.
ఇక టమాటాల విషయానికి వస్తే.. కిడ్నీ స్టోన్లు ఏర్పడకుండా ఉండాలంటే.. వాటిని తినడం తగ్గించాలని, లేదా పూర్తిగా మానేయాలని చెబుతుంటారు. కానీ ఇది పూర్తిగా అపోహే.
Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు
Ginger Water : ఉదయం వెల్లుల్లి నీటిని తాగితే బెనిఫిట్స్..
ఎందుకంటే.. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ డయాబెటిస్ అండ్ డైజెస్టివ్ అండ్ కిడ్నీ డిసీజెస్ చెబుతున్న ప్రకారం.. టమాటాలే కాదు, ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలను వేటిని తిన్నా కిడ్నీ స్టోన్లు వచ్చేందుకు అవకాశం ఉంటుంది.
కానీ అది పూర్తిగా నిజమూ కాదు. ఎందుకంటే.. కొందరి శరీరారాలు ఆహారాల్లో అధికంగా ఉండే ఆగ్జలేట్లను ఎక్కువగా శోషించుకునే స్వభావాన్ని కలిగి ఉంటాయి.
దీంతో అలాంటి వారికి కిడ్నీ స్టోన్లు వస్తాయి. వారు ఆగ్జలేట్లు ఎక్కువగా ఉండే ఆహారాలను తినడం తగ్గించాలి.
అంతేకానీ ఇతరులు ఆ ఆహారాలను తినడం మానేయాల్సిన పనిలేదు.
టమాటాలైనా, ఇతర ఆగ్జలేట్లు ఉన్న ఆహారాలు ఏవైనా సరే.. ఆరోగ్యవంతమైన వ్యక్తులు ఎలాంటి భయం లేకుండా తినవచ్చు.
కానీ కిడ్నీ స్టోన్ల సమస్య ఉన్నవారు మాత్రం అలాంటి ఆహారాలకు దూరంగా ఉండాలి.
అలాగే ఆ సమస్య వచ్చి తగ్గిన వారు కూడా ఆయా ఆహారాలను తినడం తగ్గించాలి.
లేదా వాటికి పూర్తిగా దూరంగా ఉండాలి. దీంతో కిడ్నీ స్టోన్లు మళ్లీ రాకుండా చూసుకోవచ్చు.
కాగా అధిక బరువు ఉన్నవారు, డయాబెటిస్, హైబీపీ సమస్యలతో బాధపడేవారు కూడా ఆగ్జలేట్స్ ఎక్కువగా ఉండే ఆహారాలకు దూరంగా ఉండాలని వైద్యులు చెబుతున్నారు.
Reverse Walking : వ్యాయామంలో.. వెనక్కి వాకింగ్‌తో షాకింగ్ రిజల్ట్స్
Food in Hyderabad : హైదరాబాద్‌లో తప్పక టేస్ట్ చేయాల్సిన ఫుడ్, అవి దొరికే ప్రదేశాలు
వారిలో కిడ్నీ స్టోన్లు ఏర్పడేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయని అంటున్నారు.
ఇక పలువురు సైంటిస్టులు చేపట్టిన అధ్యయనాల ప్రకారం.. కిడ్నీ స్టోన్ల సమస్య లేని, ఆరోగ్యవంతమైన వ్యక్తులు టమాటాలను తినడం వల్ల కిడ్నీ స్టోన్లు రాకుండా ఉంటాయని.. తేలింది.
కనుక అసలు కిడ్నీ స్టోన్లు ఏర్పడని వారు నిరభ్యంతరంగా, ఎలాంటి భయం లేకుండా వాటిని రోజూ తినవచ్చు.
కానీ కిడ్నీ స్టోన్లు ఒకసారి ఏర్పడి తొలగిపోయినా, పదే పదే స్టోన్లు వస్తున్నా.. అలాంటి వారు మాత్రం ఆగ్జలేట్లు, కాల్షియం వంటి పదార్థాలు ఎక్కువగా ఉండే టమాటాలు, పాలకూర, నట్స్, బీట్‌రూట్, చాకొలేట్, టీ, సోయా వంటి ఆహారాలను తీసుకోరాదని సూచిస్తున్నారు.
వాటిని వీలైనంత వరకు తగ్గించి తీసుకోవడమో లేదా పూర్తిగా మానేయడమో చేయాలని అంటున్నారు.
లేదంటే సమస్య ఇంకా తీవ్రమయ్యే అవకాశం ఉంటుందని అంటున్నారు.
Edible oil adulteration : ఆయిల్ సర్వే.. వంటనూనెలు కల్తీమయం!
Healthy snacks : టిఫిన్, వీటిలో అల్లం వాడితే వచ్చే ఆరోగ్య ప్రయోజనాలు అద్బుతం
Joint Pains : జాయింట్ పెయిన్స్, మోకాలి నొప్పులకు ఈ మూలికలతో చెక్