మాజీ ఎమ్మెల్యే ఇంట్లో నోట్ల కట్టలు, తుపాకులు, కిలోల కొద్దీ బంగారం పట్టుబడ్డ ఘటన హరియాణాలో చోటు చేసుకున్నది. హరియాణాకు చెందిన మాజీ ఎమ్మెల్యే దిల్ బాగ్ సింగ్ ఇంట్లో ఆ రాష్ట్ర అధికారులు సోదాలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా అతడికి చెందిన ఇండ్లల్లో రైయిడ్స్ జరిగాయి. దీంతో భారీగా నగదు పట్టుబడింది. విదేశాల్లో తయారైన తుపాకులు, 100 మద్యం బాటిళ్లు, కేజీల కొద్ది బంగారం, వెండిని అధికారులు గుర్తించారు. గురువారం మొదలైన దరఖాస్తులు శుక్రవారం కూడా కొనసాగుతున్నాయి.