– బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ
ఇదే నిజం, తెలంగాణ బ్యూరో: ప్రముఖ జానపద కళాకారుడు కిన్నెర మొగిలయ్యను తాను అండగా ఉంటానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ హామీ ఇచ్చారు. ఆదివారం మొగిలయ్యను కేటీఆర్ కలిశారు. ఈ సందర్భంగా మొగిలయ్య మాట్లాడుతూ.. తనకు జాగా ఇప్పించాలని అడిగారు. తాను రూ. కోట్లు, లక్షలు చూడలేదని.. ఏండ్లుగా ఎన్నో కష్టాలు పడి.. బతుకీడ్చానని ఆయన తెలిపారు. కేసీఆర్ పుణ్యాన తనకు పేరు వచ్చిందని మొగలియ్య తెలిపారు. జాగా ఇప్పించాలని ఆయన కోరారు. తప్పకుండా జాగా వచ్చేలా చూస్తానని మొగిలయ్యకు కేటీఆర్ హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా కేటీఆర్ వెంట ఎమ్మెల్యేలు మల్లారెడ్డి, వివేకానంద్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు, మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఉన్నారు. కిన్నెర మొగిలయ్యకు బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నెలకు రూ.10 వేల పెన్షన్ను కాంగ్రెస్ సర్కారు నిలిపివేసింది. దాంతో ఆయన ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో కేటీఆర్ ఆయనకు అండగా ఉంటానని భరోసా ఇచ్చారు.