– బీజేపీది సామాజిక న్యాయమే
– బీఆర్ఎస్, కాంగ్రెస్.. ఎంఐఎంను అడ్డుపెట్టుకొని రాజకీయం
– కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి
ఇదేనిజం, తెలంగాణ బ్యూరో : బీజపీ హామీ ఇస్తే పక్కాగా అమలు చేస్తుందని కేంద్ర మంత్రి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్రెడ్డి అన్నారు. ఆదివారం ఆయన హైదరాబాద్‌లో విలేకరులతో మాట్లాడుతూ భారతీయ జనతా పార్టీ దమ్ము, ధైర్యం ఉన్న పార్టీ బీజేపీనే అన్నారు. హామీలు ఇచ్చి ఊరుకోకుండా అమలు చేసి చూపిస్తుందన్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మొదటి ఐదేళ్లలో మంత్రివర్గంలో మహిళలకు సీఎం కేసీఆర్ చోటు ఇవ్వలేదన్నారు. అంతేకాదు కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలకు బీసీలకు అన్యాయం చేశాయన్నారు. బీజేపీ సామాజిక న్యాయం చేసిన పార్టీ అని, అబ్ధుల్ కలాంను రాష్ట్రపతి చేసిన ఘనత కూడా తమకే దక్కిందన్నారు. అంతేకాదు ఆదివాసీ సామాజిక వర్గానికి చెందిన మహిళను రాష్ట్రపతిని చేశామన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఎంఐఎంను అడ్డుపెట్టుకొని ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయన్నారు. మంత్రులు ఓల్డ్ సిటీకి వెళ్లాలంటే అసదుద్దీన్ అనుమతి తీసుకొని పర్యటించాల్సిన పరిస్థితి నెలకొన్నదన్నారు. మజ్లిస్ పార్టీ ప్రాభల్యం ఉన్న ప్రాంతాల్లో కరెంట్ బిల్లులు కట్టరని, వారిని అడిగే ధైర్యం కూడా అధికారులకు లేదన్నారు. ఎంఐఎం రౌడీయిజాన్ని, గూండాయిజాన్ని ప్రోత్సహిస్తుందని కిషన్రెడ్డి ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆరోపించారు.