ఆధార్ ఇప్పుడు అంతట అవసరమే.. దాంతో ఎప్పుడు ఏ అవసరం పడుతుందో చెప్పలేం. అలా ఎప్పుడైనా ఆధార్‌తో పనిపడ్డప్పుడు జేబులో ఆధార్ కార్డు ఉండకపోవచ్చు. కనీసం ఆధార్ నంబర్ చెబుదామన్నా నంబర్ గుర్తుండదు. ఆ సమయంలో ఏం చేయాలా? అని తెగ టెన్షన్ పడిపోతుంటాం. కానీ అంత కంగారు పడాల్సిన అవసరం లేదు. మీ చేతిలో ఒక స్మార్ట్‌ఫోన్, అందులో ఇంటర్నెట్ ఉంటే చాలు.. నిమిషాల్లోనే ఆధార్ నంబర్‌ను తెలుసుకోవచ్చు. అదెలాగో ఇప్పుడు తెలుసుకుందాం.
- ఆధార్ నంబర్ తెలుసుకోవాలంటే ముందుగా మీ మొబైల్ నంబర్ ఆధార్ కార్డుతో అనుసంధానమై ఉండాలి. అప్పుడే ఆధార్ నంబర్ తెలుసుకోవడం సాధ్యమవుతుంది.
- ముందుగా మీ బ్రౌజర్‌లో యూఐడీఏఐ అధికారిక వెబ్‌సైట్ (https://uidai.gov.in/) ఓపెన్ చేయాలి
- యూఐడీఏఐ వెబ్‌సైట్ ఓపెన్ అయ్యాక ‘మై ఆధార్’ సెక్షన్‌లోని ‘ఆధార్ సర్వీసెస్’లో ఉన్న ‘రిట్రైవ్ లాస్ట్ ఆర్ ఫర్గాటెన్ ఈఐడీ/యూఐడీ’పై క్లిక్ చేయాలి.
- అప్పుడు కొత్త పేజి ఓపెన్ అవుతుంది. అందులో ఆధార్ నంబర్(యూఐడీ) సెలెక్ట్ చేసుకోవాలి.
- ఆ తర్వాత మొబైల్ నంబర్ లేదా ఈ మెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి
- అనంతరం క్యాప్చా కోడ్ ఎంటర్ చేసి, Send OTP పై క్లిక్ చేయాలి
- మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆరు అంకెల ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేసి లాగిన్‌పై క్లిక్ చేయాలి.
- లాగిన్‌పై క్లిక్ చేయగానే మీ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌కు ఆధార్ నంబర్ మెసేజ్ వస్తుంది