మాజీ మంత్రి హరీశ్ రావుకు మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. ‘హరీశ్ రావు బీఆర్ఎస్ ఉద్యోగి మాత్రమే అని అయన అన్నారు. హరీశ్ రావు ఆ పార్టీకి అధ్యక్షుడు కాలేడు. సీఎం కూడా కాలేడని కోమటిరెడ్డి అన్నారు. రాజీనామా పేరుతో హరీశ్ రావు డ్రామాలు చేస్తున్నాడు. మనిషి పెరిగాడు కానీ.. బుర్ర పెరగలేదు. బీఆర్ఎస్ పార్టీ అవినీతి, మోసాల పార్టీ. ఆగస్టు15లోపు రూణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ ప్రకటించారు. ఇప్పటికే 5 గ్యారెంటీలు అమలు చేశాం’ అని ఆయన అన్నారు.