HomeతెలంగాణKTR: We achieved success by uniting the sentiment KTR : Sentiment కలిసొచ్చింది...

KTR: We achieved success by uniting the sentiment KTR : Sentiment కలిసొచ్చింది గెలుపుమాదే

– ఎన్నికల షెడ్యూల్​పై కేటీఆర్​ న్యూమరాలజీ
– తమ పార్టీకి 6 కలిసొస్తుందని ఆశాభావం
– పరకాల బహిరంగసభ ఐటీ మంత్రి కొత్త లెక్కలు

ఇదేనిజం, తెలంగాణ బ్యూరో: ఎన్నికల షెడ్యూల్​ వచ్చేసింది. దీంతో అన్ని పార్టీలూ దూకుడు పెంచాయి. ఇప్పటికే మంత్రులు కేటీఆర్, హరీశ్​ రావు రాష్ట్రంలో విస్తృతంగా పర్యటిస్తున్నారు. సోమవారం ఎన్నికల షెడ్యూల్​ రావడంతో మరింత స్పీడు పెంచారు. ఎన్నికల షెడ్యూల్​ తేదీని సైతం కేటీఆర్​ తెలివిగా తనకు అనుకూలంగా మార్చుకున్నారు. సోమవారం పరకాల బహిరంగ సభలో కేటీఆర్​ మాట్లాడుతూ.. ‘ఎన్నికల షెడ్యూల్​ వచ్చిన తేదీ 30, ఫలితాలు రాబోయేది 3 వ తేదీ. వెరసి 3+3=6. మాకు ఆరు లక్కీ నంబర్​ కాబట్టి సీఎం కేసీఆర్​ కచ్చితంగా హ్యాట్రిక్​ సీఎం అవుతారు.’ అంటూ కేటీఆర్​ వ్యాఖ్యానించారు. ప్రస్తుతం ఈ కామెంట్స్​ సోషల్ మీడియాలో వైరల్​ అవుతున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో బీఆర్ఎస్​ పార్టీ అభ్యర్థులను ప్రకటించి దూకుడుగా ముందుకు సాగుతోంది. కాంగ్రెస్, బీఆర్ఎస్ ఇప్పటివరకు అభ్యర్థులను ప్రకటించలేదు. ఇంకా కసరత్తు జరుగుతూనే ఉంది. అయితే మంత్రి కేటీఆర్, హరీశ్​ రావు లు మాత్రం ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఎక్కడి కక్కడ పంచ్​ డైలాగులు పేలుస్తూ ప్రజలను ఉత్సాహపరుస్తున్నారు. తాజాగా కేటీఆర్​ 6 లక్కీ నంబర్​ అంటూ వ్యాఖ్యానించారు. మరి బీఆర్ఎస్​ పార్టీకి ఈ లక్కీ నంబర్​ కలిసొస్తుందా? అన్నది వేచి చూడాలి.

Read More :

KCR Vision వల్లే Hyderabad అభివృద్ధి 
http://idenijam.com/he-said-that-hyderabad-has-developed-because-of-kcrs-vision/

Recent

- Advertisment -spot_img