HomeరాజకీయాలుKTR : తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్

KTR : తలసరి ఆదాయంలో మనమే నంబర్ వన్

– రాష్ట్రానికి పెద్దఎత్తున పెట్టుబడులు వస్తున్నయ్
– మంత్రి కేటీఆర్


ఇదే నిజం, హైదరాబాద్: రాష్ట్రానికి పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయని మంత్రి కేటీఆర్ అన్నారు. తాజ్‌ డెక్కన్‌లో నిర్వహించిన తెలంగాణ బిల్డర్స్‌ ఫెడరేషన్‌ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు. పెట్టుబడులు వస్తున్నందునే నగరంలో సంపద పెరుగుతోందన్నారు. ఈ పదేళ్లలో తెలంగాణ ప్రజల జీవన ప్రమాణాలు పెరిగాయని చెప్పారు. తలసరి ఆదాయంలో దేశంలోనే మన రాష్ట్రం నంబర్‌వన్‌గా నిలిచిందన్నారు.‘ప్రాధాన్యతా క్రమంలో సమస్యలన్నీ పరిష్కరిస్తున్నాం. కొత్త రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులపై ప్రత్యేక దృష్టి సారించాం. తాగు, సాగునీరు, విద్యుత్ సమస్యలు పరిష్కరించుకున్నాం. ఓఆర్‌ఆర్‌, ఆర్‌ఆర్‌ఆర్‌ మధ్య సరికొత్త హైదరాబాద్‌ తయారవుతోంది. సిటీకి రాకపోకలు చాలా సులువుగా జరగాలి. త్వరలో ప్రతిరోజూ తాగునీరు ఇచ్చేలా చూస్తాం. రెండేళ్లు కరోనా ఉన్నా ఐటీరంగంలో విశేష వృద్ధి సాధించాం. ఐటీ ఉద్యోగాల కల్పనలో రెండేళ్లుగా బెంగళూరును అధిగమిస్తూ వస్తున్నాం. రాష్ట్రంలో అభివృద్ధి, ప్రగతి ఇలాగే కొనసాగాలి. కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే 6 గ్యారంటీలు అమలవుతాయో లేదో చెప్పలేం కానీ 6 నెలలకో సీఎం మారడం మాత్రం గ్యారంటీ. రాష్ట్రాభివృద్ధికి స్టేబుల్‌ గవర్నమెంట్‌.. ఏబుల్‌ లీడర్‌షిప్‌ అవసరం. కాంగ్రెస్‌ ప్రభుత్వం వస్తే పదవుల కోసం నిత్యం కొట్లాటలే. సంపద సృష్టిస్తేనే కదా దాన్ని పేదప్రజలకు పంచగలం. సంపద సృష్టించాలంటే రాష్ట్రంలో శాంతిభద్రతలు బాగుండాలి. కర్ణాటకలో కాంగ్రెస్‌ ప్రభుత్వం వచ్చాక అక్కడ పరిస్థితి దారుణంగా తయారైంది’అని కేటీఆర్‌ విమర్శించారు.

Recent

- Advertisment -spot_img