Homeవిచిత్రంLion rested on the seashore సముద్రపు ఒడ్డున సేదతీరిన మృగరాజు

Lion rested on the seashore సముద్రపు ఒడ్డున సేదతీరిన మృగరాజు

ఇదే నిజం, నేషనల్ బ్యూరో : ‘ది క్రానిక‌ల్స్ ఆఫ్ నార్నియా’సినిమాలోని చివరి సీన్​లో సింహం సముద్ర తీరాన గంభీరంగా నిలబడి ఉంటుంది. అలాంటి సీన్​ గుజరాత్​లోని అరేబియా సముద్రం వద్ద కనిపించింది. అరేబియా సముద్ర తీరంలో గంభీరంగా నిలబడిన సింహం హాయిగా వచ్చి పోయే అలలను ఆస్వాదిస్తూ సేదతీరింది. దీనికి సంబంధించిన ఫొటోను ఇండియన్‌ ఫారెస్ట్‌ సర్వీస్‌ అధికారి ప‌ర్వీన్ క‌శ్వ‌న్ ట్విటర్‌లో షేర్‌ చేశారు. ‘నార్నియా చిత్రం నిజమైన వేళ. గుజరాత్‌ తీరంలో అలలను ఆస్వాదిస్తున్న సింహం’అని క్యాప్షన్‌ ఇచ్చారు. ప్రస్తుతం ఈ పోస్టు నెట్టింట వైరల్‌గా మారింది. అంతేకాకుండా ఆసియా సింహాలు సముద్ర తీరాల్లో నివసించడంపై చేసిన ఓ పరిశోధనా పత్రాన్ని కూడా పర్వీన్‌ షేర్‌ చేశారు. ఆసియా సింహాలు నివాసముండే ప్రాంతానికి వెళ్లి కొందరు ఈ దృశ్యాన్ని చిత్రీకరించినట్లు తెలిపారు. ‘ఇది నిజంగా అద్భుతమైన దృశ్యం. ప్రకృతికి మరింత శోభనిచ్చేలా ఉంది’అంటూ నెటిజన్లు కామెంట్లు చేశారు.

Recent

- Advertisment -spot_img