Homeఆంధ్రప్రదేశ్Manipal Hospital : విజయవాడలో మొట్టమొదటి కాక్లియర్‌ ఇంప్లాంట్‌

Manipal Hospital : విజయవాడలో మొట్టమొదటి కాక్లియర్‌ ఇంప్లాంట్‌

Manipal Hospital : విజయవాడలో మొట్టమొదటి కాక్లియర్‌ ఇంప్లాంట్‌

Manipal Hospital – తమ 15వ వార్షికోత్సవ సందర్భంగా మణిపాల్‌ హాస్పిటల్స్‌ , విజయవాడ ఓ అవగాహన ఒప్పందంను  అత్యుత్తమ సేవల ద్వారా నైపుణ్యం వృద్ధి చేసేందుకు భారతదేశపు ఒకే ఒక్క ప్రైవేట్‌ లివర్‌ ఇనిస్టిట్యూట్‌తో అవగాహన ఒప్పందం చేసుకుంది. 

ఈ అవగాహన ఒప్పందంను మణిపాల్‌ హాస్పిటల్స్‌ మేనేజిండ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవొ దిలీప్‌ జోస్‌ ; మణిపాల్‌ హాస్పిటల్స్‌ సీఓఓ కార్తీక్‌ రాజగోపాల్‌, పూర్వ భారత క్రికెటర్‌, ఎన్‌సీఏ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సమక్షంలో సౌత్‌ ఆసియన్‌ లివర్‌ ఇనిస్టిట్యూట్‌,

హైదరాబాద్‌కు చెందిన డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ తో మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ , హాస్పిటల్‌ డైరెక్టర్‌, డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి చేసుకున్నారు.

మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ 2016లో లివర్‌ ట్రాన్స్‌ప్లాంటేషన్స్‌ను ప్రారంభించింది.

అప్పటి నుంచి విజయవంతంగా 40 కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలను చేసింది.

వీటిలో 35 మరణాంతర మార్పిడిలు కాగా 5 జీవించి ఉన్న వ్యక్తుల నుంచి సేకరించిన కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు.

వీటిలోనూ మూడు చిన్నపిల్లలకు సంబంధించిన కాలేయ మార్పిడి కేసులు.

ఇప్పుడు డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ తన టీమ్‌తో బోర్డుపై చేరారు.

వారు సంయుక్తంగా అత్యధిక సంఖ్యలో కాలేయ మార్పిడి శస్త్రచికిత్సలు చేయడం ద్వారా సమర్థవంతంగా ప్రజలకు సేవలనందిస్తున్నారు.

ఈ సందర్భంగా డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ మాట్లాడుతూ ‘‘అత్యధిక సంఖ్యలో ప్రజలకు సేవలనందిస్తున్న భారతదేశంలో రెండవ అతిపెద్ద మల్టీ స్పెషాలిటీ హెల్త్‌కేర్‌ సంస్ధతో ఒప్పందం చేసుకోవడం పట్ల సంతోషంగా ఉన్నాను.

మణిపాల్‌ హాస్పిటల్స్‌ బోర్డ్‌పైకి రావడం ద్వారా కాలేయ సంరక్షణలో మా వైద్య నైపుణ్యం మరింత ముందుకు తీసుకువెళ్లే అవకాశం మాకు లభించడంతో పాటుగా సమాజానికి అత్యుత్తమ చికిత్సలను అందించడమూ వీలవుతుంది.

సంయుక్తంగా, మేము కాలేయ వ్యాధులు మరియు కాలేయ క్యాన్సర్‌లకు చికిత్సనందించడం పరంగా పరిశ్రమలో అత్యున్నత ప్రమాణాలను సృష్టించడానికి ప్రయత్నించనున్నాము’’ అని అన్నారు.

అదనంగా మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ ఇప్పుడు విజయవాడ నగరంలో మొట్టమొదటి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ కార్యక్రమం ప్రారంభించింది.

తద్వారా నగరంతో పాటుగా చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలను చేరుకోవడంతో పాటుగా అందుబాటులోని అత్యుత్తమ సంరక్షణ మరియు సదుపాయాలను తెలుపడం ద్వారా వారికి సహాయపడనుంది.

ఈ ప్రారంభం గురించి ఈఎన్‌టీ, హెడ్‌ అండ్‌ నెట్‌ సర్జరీ– కన్సల్టెంట్‌ డాక్టర్‌ వెంకట కృష్ణ సందీప్‌ మాట్లాడుతూ ‘‘కాక్లియర్‌ ఇంప్లాంట్‌ను చిన్నారులతో పాటుగా సెన్సరీ న్యూరల్‌ హియరింగ్‌ లాస్‌ (ఇంద్రియ సంబంధిత నాడీ వ్యవస్థ కారణంగా వినికిడిలోపం) కలిగిన పెద్దలకు అమరుస్తారు.

ఇప్పటి వరకూ, మేము నాలుగు సంవత్సరాల లోపు వయసు కలిగిన ఇద్దరు చిన్నారులకు కాక్లియర్‌ ఇంప్లాంట్‌ సర్జన్‌ డాక్టర్‌ యార్లగడ్డ సుబ్బారాయుడు మెంటార్‌షిప్‌ కింద శస్త్రచికిత్స చేశాము.

చిన్నారులకు అత్యుత్తమ నాణ్యత కలిగిన జీవితం అందించడంతో పాటుగా లోపాలనేవి భవ్యిత్‌లో వారు సాధించబోయే విజయాలకు ఏమాత్రం అవరోధం కాకూడదన్నది మా ప్రధమ లక్ష్యం.’’ అని అన్నారు.

మణిపాల్‌ హాస్పిటల్స్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అండ్‌ సీఈవో దిలీప్‌ జోస్‌ మాట్లాడుతూ ‘‘ సౌత్‌ ఆసియన్‌ లివర్‌ ఇనిస్టిట్యూట్‌ తో భాగస్వామ్యం చేసుకోవడం పట్ల మేము చాలా సంతోషంగా ఉన్నాము.

ఈ భాగస్వామ్యంతో భారతదేశంలో కాలేయ వ్యాధుల చికిత్సను మరింత మెరుగుపరచడంతో పాటుగా ప్రపంచ వ్యాప్తంగా అందుబాటులోని అత్యుత్తమ క్లీనికల్‌ సంరక్షణతో సమానంగా అందించగలము.

మణిపాల్‌ హాస్పిటల్స్‌లో ఈ నూతన జోడింపు మరో మైలురాయిగా నిలువడంతో పాటుగా మన దేశ వైద్య సంరక్షణ వ్యవస్ధలో కాలేయ వ్యాధుల చికిత్సల పరంగా పురోగతికి మరియు అత్యాధునిక ఆవిష్కరణలకు మార్గం సుగమం చేయనుంది.

వైద్య నైపుణ్యం, శస్త్రచికిత్స సంరక్షణ, సమగ్రత పరంగా మరింత అభివృద్ధిని ఇది సాధ్యం చేయడంతో పాటుగా కాలేయ వ్యాధుల చికిత్స పరంగా మరింత విజయశాతం నమోదు చేయడంలోనూ తోడ్పడనుంది’’ అని అన్నారు.

మణిపాల్‌ హాస్పిటల్స్‌, విజయవాడ–హాస్పిటల్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ సుధాకర్‌ కంటిపూడి మాట్లాడుతూ ‘‘ డాక్టర్‌ టామ్‌ చెరియన్‌ మా బోర్డ్‌పై చేరడంతో,

ఇప్పుడు సంయుక్తంగా మేము అత్యుత్తమ శ్రేణి కాలేయ మార్పిడి సేవలను విజయవాడ మరియు చుట్టు పక్కల ప్రాంతాల ప్రజలకు తీసుకురానున్నాము.

విజయవాడలో మొట్టమొదటి కాక్లియర్‌ ఇంప్లాంట్‌ కార్యక్రమం ప్రారంభించడంతో ఈ ప్రాంతపు చుట్టుపక్కల ప్రజలకు అత్యుత్తమ ఆరోగ్య ఫలితాలను తీసుకువచ్చే అవకాశం మాకు కలిగింది’’ అని అన్నారు.

అంతేకాదు, డిసెంబర్‌ 05వ తేదీన జరిగిన 10కె/5కె రన్‌ విజేతలను వార్షికోత్సవ సందర్భంగా ఏర్పాటుచేసిన భారీ కార్యక్రమంలో నగదు బహుమతితో పూర్వ భారత క్రికెటర్‌, ఎన్‌సీఏ హెడ్‌ వీవీఎస్‌ లక్ష్మణ్‌ సత్కరించారు.

Recent

- Advertisment -spot_img