Homeలైఫ్‌స్టైల్‌Best Diet : మ‌ంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్ర‌పంచంలో మంచి డైట్‌

Best Diet : మ‌ంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్ర‌పంచంలో మంచి డైట్‌

Best Diet : మ‌ంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్ర‌పంచంలో మంచి డైట్‌

Best Diet :మెడిటరేనియన్‌ డైట్‌(Mediterranean Diet) ప్రపంచంలోనే అత్యత్తమ డైట్‌గా వరుసగా ఐదో ఏడాది ఎంపికైంది.

ఈ అవార్డును యూఎస్‌ న్యూస్‌ అండ్‌ వరల్డ్‌ రిపోర్ట్‌ అందజేస్తుంది.

వివిధ డైట్లను ఆసాంతం పరిశీలించిన తర్వాతనే అత్యుత్తమ డైట్‌ను ఎంపికచేస్తారు.

గత ఐదేండ్లుగా అత్యుత్తమ డైట్‌గా ఎంపికవుతున్న మెడిటరేనియన్‌ డైట్‌(Mediterranean Diet)ను అనుసరించడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు.

మధుమేహం, జ్ఞాపకశక్తి కోల్పోవడం, రొమ్ము క్యాన్సర్, గుండెపోటు వంటి తీవ్రమైన వ్యాధులను నివారించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుందని వారు చెప్తున్నారు.

Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు

Insurance : ఈ వ‌య‌సులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..

అలాగే, వేగంగా బరువు తగ్గడంలో, మనస్సును యవ్వనంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుందంటున్నారు.

మెడిటరేనియన్‌ డైట్‌(Mediterranean Diet) అనేది మొక్కల ఆధారిత ఆహారం.

ఈ డైట్‌లో పండ్లు, కూరగాయలపై ఎక్కువ ఫోకస్ ఉంటుంది.

వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ధాన్యాలు, గింజలు, విత్తనాలను ఈ డైట్‌లో చేర్చారు. పచ్చి ఆలివ్ నూనెను కొవ్వుగా ఉపయోగిస్తారు.

ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ అధికంగా ఉండే చేపలను ఎక్కువగా తింటారు.

ఈ ఆహారంలో చక్కెర, ఎర్ర మాంసం, గుడ్లు, చికెన్, టర్కీ చికెన్‌, పాల ఉత్పత్తులను చాలా తక్కువగా ఉపయోగిస్తారు.

Robots : ఈ రోబో మనిషి మెద‌డునే చ‌దివేస్తుంది

VR Headset : ఆవులకు వీఆర్‌ హెడ్‌సెట్లు.. పెరిగిన పాల ఉత్పత్తి

పరిమిత పరిమాణంలో ఆల్కహాల్ తాగడం కూడా మంచిదేనంటారు.

శుద్ధి చేసిన నూనె, ప్రాసెస్ చేసిన ఆహారాలను ఈ డైట్‌ నుంచి నిషేధించారు.

మెడిటరేనియన్‌ డైట్‌(Mediterranean Diet)తో ప్రయోజనాలివీ..

గుండె ఆరోగ్యంగా ఉంటుంది: మెడిటరేనియన్ ఆహారాన్ని అనుసరించడం వల్ల గుండెపోటు, స్ట్రోక్‌ వంటి గుండె సంబంధ వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది.

డిప్రెషన్ ప్రమాదం తక్కువ: ఈ ఆహారాన్ని అనుసరించే వ్యక్తులు ఇతరులతో పోలిస్తే 33 శాతం తక్కువ డిప్రెషన్‌కు గురవుతారు.

మనస్సు యవ్వనంగా మారుతుంది: ఈ డైట్‌ మెదడుపై సానుకూల ప్రభావాన్ని చూపుతుండటం వల్ల మనసుకు ఏకాగ్రత, జ్ఞాపకశక్తి పెరుగుతుంది.

అల్జీమర్స్, జ్ఞాపకశక్తి తగ్గడం వంటి మానసిక వ్యాధుల ముప్పు కూడా తగ్గుతుంది.

Instant Loan : ఇన్​స్టంట్​ లోన్​ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే

Airplane drops human waste : విమానంలో బాత్‌రూమ్​ వ్యర్థాలు గాలిలోనే జనాల మీద వదిలేస్తారా

లాంగ్ లైఫ్: ఈ డైట్ సహాయంతో ఎక్కువ కాలం జీవించవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు.

జీవితకాలంలో ఎక్కువ వ్యాధులు ఉండకపోవడమే దీనికి కారణంగా చెప్పుకోవచ్చు.

ఎముకలు దృఢంగా ఉంటాయి: ఈ ఆహారం స్త్రీల ఎముకలను బలంగా మార్చడంలో సహాయపడుతుంది.

ఈ ఆహారంలో ఉండే పోషకాలు ఎముకల జీవక్రియను పెంచుతాయి.

రొమ్ము క్యాన్సర్ నివారణ: ఈ ఆహారాన్ని నిరంతరం ఫాలో అయ్యే వారికి రొమ్ము క్యాన్సర్ వచ్చే ప్రమాదం 40 శాతం తగ్గుతుంది.

మధుమేహం అదుపులో ఉంటుంది: మెడిటరేనియన్ డైట్‌ని అనుసరించడం వల్ల టైప్-2 మధుమేహం వచ్చే ప్రమాదం తగ్గుతుంది, ఎందుకంటే ఇది రక్తంలో చక్కెరను అదుపులో ఉంచుతుంది.

ఈ ప్రయోజనాలతో పాటు వేగంగా బరువు తగ్గడం, అంగస్తంభన లోపాన్ని సవరించుకోవడానికి, చిత్తవైకల్యం తగ్గించుకోవడానికి కూడా సహాయపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Ginger Water : ఉద‌యం వెల్లుల్లి నీటిని తాగితే బెనిఫిట్స్‌..

Omicron Symptoms : ఒమిక్రాన్ సోకిన వారిలో ఈ ల‌క్ష‌ణాలు.. చ‌ర్మం, పెద‌వులు, గోళ్లు ..!

Recent

- Advertisment -spot_img