HomeసినిమాMegastar's 157th movie in 2025! 2025లో మెగాస్టార్​ 157వ సినిమా!

Megastar’s 157th movie in 2025! 2025లో మెగాస్టార్​ 157వ సినిమా!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం మల్లిడి వశిష్ఠ దర్శకత్వంలో తన 157వ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. అయితే ఇటీవల అనౌన్స్ మెంట్ వచ్చిన ఈ మూవీ పై అందరిలో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ మూవీలో మెగాస్టార్ కి జోడీగా ముగ్గురు హీరోయిన్స్ నటించే ఛాన్స్ ఉందట. అలానే దీనిని సోషియో ఫాంటసీ ఎంటర్టైనర్​గా మెగా ఫ్యాన్స్ తో పాటు నార్మల్ ఆడియన్స్ ని కూడా ఆకట్టుకునేలా దర్శకుడు వశిష్ఠ తెరకెక్కించనున్నట్లు సమాచారం. యూవీ క్రియేషన్స్ బ్యానర్​పై నిర్మితం కానున్న ఈ మూవీకి సంబంధించి ప్రస్తుతం ఒక న్యూస్ బజ్​గా తెగ వైరల్ అవుతోంది. దీని ప్రకారం ఇటీవల మోకాలికి మైనర్ సర్జరీ చేయించుకున్న మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం రెస్ట్ తీసుకుంటున్నారని, నవంబర్ ఫస్ట్ వీక్ నుంచి 157వ మూవీ షూటింగ్ మొదలెట్టేందుకు సిద్ధం అవుతున్నారని తెలుస్తోంది. అలానే అక్కడి నుంచి ఏప్రిల్ చివరి వారం వరకు నాన్ స్టాప్ గా షూటింగ్ పూర్తి చేసి అనంతరం 6 నెలల పాటు వీఎఫ్ఎక్స్ వర్క్ నిర్వహించనున్నట్లు టాక్. అలానే మూవీని 2025 సంక్రాంతికి ఆడియన్స్ ముందుకి తీసుకురావాలనేది మేకర్స్ ప్లాన్ అట. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ గురించి మరిన్ని వివరాలు తొందరలో ఒక్కొక్కటిగా వెల్లడి కానున్నాయి.

Recent

- Advertisment -spot_img