MG Electric Car : కొత్త కొత్త ఫీచర్లతో ఎంజీ మోటార్ ఎలక్ట్రిక్ కార్..
MG Electric Car : ఎంజీ మోటార్ ఇండియా 2020లో ప్రవేశపెట్టిన ఎలక్టిక్ కారుకు సరికొత్త హంగులు జోడించి మార్కెట్లోకి విడుదల చేసింది.
ఇది ఒక్కసారి ఛార్జ్ చేస్తే 461కి.మీ ప్రయాణిస్తుంది.
రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్న ఈ ఈవీ ఫీచర్లు, ధర ఎలా ఉన్నాయంటే..?
జెడ్ఎస్ ఈవీ విద్యుత్ కారును భారత మార్కెట్లో విడుదల చేసింది ఎంజీ మోటార్ ఇండియా.
2020లో సంస్థ ప్రెవేశపెట్టిన ఈ తొలి ఎలక్ట్రిక్ కారుకు ఆధునిక హంగులు జోడించి సోమవారం మార్కెట్లోకి తీసుకొచ్చింది.
ఎగ్జైట్, ఎక్స్‌క్లూజివ్ రెండు వేరియంట్లతో దీన్ని అందుబాటులో ఉంచింది.
Exit Polls : పంజాబ్‌లో కేజ్రీవాల్ హిట్- ఆప్‌దే పీఠం.. యూపీ భాజపాదే..
Jaggery Lemon water : అధిక బరువును తగ్గించే సూపర్ ఫుడ్స్.. నిమ్మరసం, బెల్లం
ధర రూ.21.99-25.88 లక్షలుగా నిర్ణయించింది.
ఈ కారు ఫీచర్లు ఎలా ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..
ఎక్స్‌టీరియర్: గత వెర్షన్లతో పోలిస్తే కొత్త కారులో అనేక మార్పులు చేశారు.
గతంలో ఉన్న డీప్ కాన్‌కేవ్ లేఅవుట్ స్థానంలో ఎన్‌క్లోజ్డ్ గ్రిల్‌ను అమర్చారు.
ఇక ఎంజీ లోగోకు పైన ఉన్న ఛార్జింగ్ సాకెట్‌ను మార్చారు.
దానిని లోగోకు ఎడమ భాగంలోకి అమర్చారు.
పెద్ద సెంట్రల్ ఎయిర్ డ్యామ్, చివర్లలో నిలువు ఇంటేక్స్‌తో బంపర్ డిజైన్‌ను తీర్చిదిద్దారు.
ఇంటీరియర్: ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌ను అప్‌డేట్ చేశారు. వెనుక సీట్లకూ ఆర్మ్‌రెస్ట్‌ను అమర్చారు.
వెనుక సీట్లకు ఏసీ వెంట్లు, సెంటర్ హెడ్ రెస్ట్‌ను కూడా అందుబాటులో ఉంచారు.
Kidney Stones : టమాటాలను తింటే కిడ్నీ స్టోన్లు ఏర్పడుతాయా ?
Medicine Prices Hike | పెరగనున్న మందుల ధరలు
ఒక్కసారి ఛార్జ్ చేస్తే..: ఈ సరికొత్త జెడ్‌ఎస్‌ఈవీలో 50 కేడబ్ల్యూహెచ్ బ్యాటరీ ప్యాక్‌ను ఇస్తున్నారు.
ఒకసారి ఛార్జ్ చేస్తే 461 కి.మీ ప్రయాణిస్తుంది.
గతంలో ఇది 419 కి.మీగా ఉండేది. కేవలం 8.5 సెకన్లలోనే 0-100 కి.మీ/గం వేగాన్ని అందుకుంటుంది.
ఇతర ఫీచర్లు: ఎనిమిది అంగుళాల టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ స్థానంలో 10.1 అంగుళాల ఇన్ఫోటైన్మెంట్‌ను ప్రవేశపెట్టారు.
ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్‌ప్లే అందుబాటులో ఉంది.
సన్‌రూఫ్, ఆటోమేటిక్ హెడ్‌ల్యాంప్స్ విత్ వైపర్స్, కనెక్టెడ్ కార్ టెక్నాలజీ, ఆరు ఎయిర్‌బ్యాగ్‌లు, ఎలక్ట్రానిక్ స్టెబిలిటీ కంట్రోల్ వంటి అదనపు ఫీచర్లు ఉన్నాయి.
Lemon Water : లెమన్ వాటర్‌ను ఎప్పుడు తాగితే మంచిది ?
Post Office Scheme : పోస్టాఫీస్‌లో ఇలా నెలకు రూ.4,950 ఆదాయం
ఈ నాలుగు రాశుల వారు అత్యంత నిజాయితీపరులు.. అస్సలు అబద్దాలు చెప్పరు..!