ఇదే నిజం, బుగ్గారం: జగిత్యాల జిల్లా బుగ్గారం మండలం మద్దునూరు గ్రామానికి చెందిన బండారి రాజయ్య సతీమణి బండారి సత్తవ్వ ఏడాది క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తో ప్రాణాలు కోల్పోయారు. దీంతో ఆమెకు బీఆర్ఎస్ పార్టీ నుంచి ప్రమాద బీమా అందింది. గురువారం మద్దునూరులో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ స్పీకర్ మధుసూదనాచారి ఇందుకు సంబంధించిన చెక్కులను మంత్రి కొప్పులకు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల కో ఆప్షన్ ఎండీ రహమాన్, బీఆర్ఎస్ పార్టీ బుగ్గారం మండల అధ్యక్షుడు మహేష్, ఎంపీటీసీ తదితరులు పాల్గొన్నారు.