Homeజిల్లా వార్తలుకోయిల్ సాగర్ సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు

కోయిల్ సాగర్ సాగునీటిని విడుదల చేసిన ఎమ్మెల్యేలు

ఇదేనిజం, మహబూబ్​ నగర్:​ దేవరకద్ర మండలంలోని కోయిల్ సాగర్ ప్రాజెక్టు నుంచి నేడు ఆయకట్టు రైతులకు యాసంగి పంటకు కుడి, ఎడమ కాలువల ద్వారా సాగునీటిని విడుదలచేశారు. దేవరకద్ర ఎమ్మెల్యే జి. మధుసూధన్ రెడ్డి, నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పర్ణిక రెడ్డి సాగునీటిని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మధుసూధన్ రెడ్డి మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తుందని అన్నారు, కాంగ్రెస్ పార్టీ కోయిల్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి 60 ఏళ్ళు గడుస్తున్న చెక్కుచెదరలేదని, బీఆర్ఎస్ ప్రభుత్వం నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ఏడాదికే పగుళ్లు వచ్చి, కుంగిపోయిందన్నారు. కాళేశ్వరం పేరుతో బిఆర్ఎస్ ప్రభుత్వం లక్ష కోట్ల ప్రజా సంపద కొల్లగొట్టిందన్నారు.

Recent

- Advertisment -spot_img