HomeరాజకీయాలుNara Lokesh : ఆంధప్రదేశ్​ను బిహార్​లా మార్చేశారు

Nara Lokesh : ఆంధప్రదేశ్​ను బిహార్​లా మార్చేశారు

– జనం కోసం పోరాడితే దొంగ కేసులు పెడుతున్నరు
– భయం మా బయోడేటాలోనే లేదు
– వైసీపీ సర్కారుపై టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేశ్ తీవ్ర స్థాయిలో విమర్శలు

ఇదే నిజం, ఏపీ బ్యూరో: వైసీపీ పాలనలో దక్షిణ భారత బిహార్‌గా ఆంధ్రప్రదేశ్​ మారిందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ విమర్శించారు. విజయవాడ రాజ్‌భవన్‌లో గవర్నర్‌ను టీడీపీ బృందం కలిసింది. అనంతరం లోకేశ్‌ మీడియాతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వ కక్ష సాధింపు చర్యలపై గవర్నర్‌కు ఫిర్యాదు చేశామన్నారు. ప్రతిపక్షాలపై సీఎం జగన్‌కు నరనరానా కక్ష సాధింపే ఉందని లోకేశ్‌ ఆరోపించారు. టీడీపీ సానుభూతిపరులపై 60 వేల కేసులు పెట్టారన్నారు. చంద్రబాబుపై ఆధారాలు లేకుండా కేసులు పెట్టారని చెప్పారు. రాజ్యాంగాన్ని కాపాడాలని గవర్నర్‌ను కోరామన్నారు. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ రాష్ట్రానికి రాకుండా అడ్డుకున్న విషయాన్ని ఆయన దృష్టికి తీసుకెళ్లామన్నారు. ‘ప్రజల కోసం పోరాడితే దొంగ కేసులు పెడుతున్నారు. భయం మా బయోడేటాలోనే లేదు.. అడ్డొస్తే తొక్కుకుంటూ వెళ్తాం. దొంగ ఓట్లు చేర్చడంపై మా పోరాటం కొనసాగిస్తాం. ముఖ్యమంత్రి పేరుపైనా దొంగ ఓట్లు ఉన్నాయి. అచ్చెన్నాయుడు ఆధ్వర్యంలో టీడీపీ బృందం బుధవారం ఎన్నికల సంఘాన్ని కలుస్తుంది. జనసేనతో సంప్రదింపులు జరిపాం.. త్వరలో ఉమ్మడి మేనిఫెస్టో విడుదల చేస్తాం. రాష్ట్రంలో కరవుతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. తాగునీటి సమస్య ఉంది. ఈ సమస్యలపై జనసేనతో కలిసి ప్రజా ఉద్యమం చేపడతాం’అని నారా లోకేశ్‌ తెలిపారు.

Recent

- Advertisment -spot_img