Nayanthara Marriage with tree : చెట్టును పెళ్లాడనున్న నయనతార..
సెలబ్రిటీలు జాతకాలని ఎక్కువగా నమ్ముతారనే విషయం మనందరికి తెలిసిందే. పెళ్లి విషయంలో అవి ఇంకా ఎక్కువగా ఉంటాయి.
నయనతార పుట్టుక సమయంలో దోషం ఉండడంతో ఆమె ఇప్పుడు పూజలు చేసేందుకు సంసిద్దమైనట్టు తెలుస్తుంది.
ఇటీవల కాలంలో నయనతార అనేక రకాల హిందూ దేవాలయాలను సందర్శించారు.
తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పలు పుణ్యక్షేత్రాలను కూడా ఆమె సందర్శించి హోమాలు యాగాలు కూడా చేసినట్లుగా వార్తలు వచ్చాయి.
ఇప్పటికే నయనతార విఘ్నేష్ శివన్ నిశ్చితార్థం చేసుకోగా, మరికొద్ది రోజులలో పెళ్లి చేసుకునేందుకు సిద్ధమయ్యారు.
ఈ క్రమంలో ఇద్దరు జాతకాలను చూపించుకోగా, నయనతార దోషం పోయేందుకు ఒక చెట్టును పెళ్లాడబోతున్న ట్లు తెలుస్తోంది.
ఈ తంతు పూర్తిచేసిన తర్వాత మూడు నాలుగు నెలల్లోనే నయన్ వివాహం జరుగుతుందని సమాచారం.
గతంలో ఐశ్వర్యారాయ్ అభిషేక్ బచ్చన్ పెళ్లి చేసుకునే ముందు కూడా ఇలాగే చేశారు. ఐష్ దోష నివారణ పూజల్లో పాల్గొన్నారు.
ఐశ్వర్యారాయ్ జననం కూడా దోషాలతో కూడుకున్నది కావడంతో ఆమె ఏకంగా మూడు చెట్లను వివాహం చేసుకుంది.
అభిషేక్ తో కాపురం సజావుగా సాగాలంటే ఇలాంటి ఆచారం తప్పదని జ్యోతిష్యులు సూచించడంతోనే ఐష్ సనాతన సంప్రదాయ పద్దతులను అనుసరించారు.