Beauty Tips : మొటిమలు, మచ్చల నివారణకు ‘వేప’ ప్యాక్
Beauty Tips : మొటిమలు, మచ్చలతో ఇబ్బందులు పడే వారు ప్రతి ఇంట్లో ఉంటారు.
మార్కెట్‌లో ఎన్ని మందులు, క్రీంలు ఉన్నా.. సహజంగా ఉండే పదార్థాలతో ప్యాక్‌లు వేసుకునేందుకు అందరూ ఆసక్తి చూపుతారు.
మీ చర్మ చర్మ సౌందర్యం కోసం వేప(నీమ్) ఆకులతో ప్యాక్ వేసుకోవచ్చని చర్మ సౌందర్య నిపుణులు చెబుతున్నారు.
VR Headset : ఆవులకు వీఆర్ హెడ్‌సెట్లు.. పెరిగిన పాల ఉత్పత్తి
ఇందులోని యాంటీబయోటిక్ గుణాలు చర్మాన్ని ఆరోగ్యంగా, అందంగా ఉంచుతాయట.
ఈ వేప ప్యాక్‌తో మొటిమలు, మచ్చలు, బ్లాక్‌హెడ్స్ వంటి సమస్యలను తొలగిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
స్కిన్ టోనర్
గుప్పెడు వేపాకులను తీసుకోని రెండు లీటర్ల నీటిలో మరిగించండి.
నీళ్లంతా ఆకుపచ్చగా మారే వరకు మరిగించండి. అనంతరం దీన్ని ఒక బాటిల్‌లో నిల్వ చేసుకోవాలి.
Robots : ఈ రోబో మనిషి మెదడునే చదివేస్తుంది
ప్రతి రోజూ స్నానం చేసే నీటిలో దాదాపు 100 మి.లీ మిశ్రమాన్ని కలిపి స్నానం చేయడం వల్ల చర్మ సమస్యలు, మొటిమలు, వైట్‌హెడ్స్‌తో పాటు వయసు ప్రభావంతో వచ్చే ముడతలు కూడా తగ్గుతాయి.
ఈ నీటిలో ఓ కాటన్ బాల్‌ని ముంచి ప్రతి రోజూ రాత్రి ముఖాన్ని తుడుచుకోండి.
దీని వల్ల పిగ్మెంటేషన్, మొటిమలు, మచ్చలు వంటివన్నీ తగ్గిపోతాయి.
ఫేస్ ప్యాక్
ఓ పది వేపాకులను తీసుకొని, దానికి కొన్ని నారింజ తొక్కలను కలిపి కొద్దిపాటి నీటిలో గుజ్జులా మారే వరకు మరిగించండి.
Best Diet : మంచి డైట్ కావాలా.. ఇదిగో ఇదేనంట ప్రపంచంలో మంచి డైట్
దాన్లో కొద్దిగా తేనె, పెరుగు, సోయా పాలు వంటివి కలపండి.
ఈ మిశ్రమాన్ని వారానికి మూడుసార్లు మొహానికి పట్టించి 15 నిమిషాల తర్వాత కడిగేయండి.
మొటిమలు, వైట్ హెడ్స్, బ్లాక్ హెడ్స్ వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.
హెయిర్ కండిషనర్
కొన్ని వేపాకులను తగినన్ని నీళ్లలో వేసి మరిగించండి.. దీన్లో తేనెను కలపండి.
Be Active : ఇలా చేస్తే యాక్టివ్‌గా ఉంటారు
ఈ గుజ్జును జుట్టుకు పట్టించి అరగంట ఉంచి తర్వాత కడిగేయండి.
ఈ మిశ్రమం జుట్టుకు కండిషనర్‌గా పనిచేస్తుంది.
బిరుసుగా ఉన్న జుట్టును పట్టులా మెత్తగా మారుస్తుంది. చుండ్రును కూడా తొలగిస్తుంది.
Insurance : ఈ వయసులోనే ఇన్సూరెన్స్ తీసుకోండి.. ఎందుకంటే..
Instant Loan : ఇన్స్టంట్ లోన్ తీసుకునేముందు ఇవి తెలుసుకోవాల్సిందే