HomeసినిమాNeha Shetty : అల్లు అర్జున్‌తో డీజే టిల్లు హీరోయిన్

Neha Shetty : అల్లు అర్జున్‌తో డీజే టిల్లు హీరోయిన్

Neha Shetty : అల్లు అర్జున్‌తో డీజే టిల్లు హీరోయిన్

ఇటీవ‌లే వ‌చ్చిన డీజే టిల్లు (DJ Tillu) సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌ను ప‌లుక‌రించింది నేహాశెట్టి.

ఈ భామ స్టార్ హీరోతో న‌టించే ఛాన్స్ కొట్టేసింద‌న్న వార్త ఇపుడు టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

ఇంతకీ నేహాశెట్టి న‌టిస్తోంది ఏ సినిమాలోనో అనుకుంటున్నారా..? లేదు ఓ యాడ్‌లోనే.

అది కూడా స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ (Allu Arjun)తో క‌లిసి చేస్తోంది.

అల్లు అర్జున్ పాపుల‌ర్ ఫుడ్ డెలివ‌రీ ప్లాట్‌ఫామ్ జొమాటో (Zomato)కు కొత్త బ్రాండ్ అంబాసిడ‌ర్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న సంగ‌తి తెలిసిందే.

జొమాటో యాడ్‌కు సంబంధించిన కొత్త ప్రోమోను విడుద‌ల చేశారు.

చాలా ఇంప్రెసిప్ ఉన్న ఈ ప్రోమో చాలా మంది ప్రేక్ష‌కులను ఆక‌ట్టుకుంటూ..మంచి వ్యూస్ రాబడుతోంది.

మ‌రోవైపు అల్లు అర్జున్ ఇటీవ‌లే పుష్ప.. ది రైజ్ తో మంచి హిట్టు కొట్టాడు.

సుకుమార్ డైరెక్ష‌న్‌లో ఈ మూవీకి రెండో పార్టుగా రాబోతున్న పుష్ప‌..ది రూల్‌తో బిజీగా ఉన్నాడు బ‌న్నీ.

త్వ‌ర‌లోనే ఈ మూవీ సెట్స్ పైకి వెళ్ల‌నుంది.

ఈ ప్రాజెక్టుకు సంబంధించిన మ‌రిన్ని వివ‌రాల‌పై త్వ‌ర‌లోనే స్ప‌ష్ట‌త రానుంది.

బ‌న్నీగారు కొంచెం ఫాస్ట్‌గా చేద్దామా..అని నేహాశెట్టి అడుగుతుంటే..హీరో ఎంట్రీ క‌దా ఆ మాత్రం ఉండాలి..అని బ‌న్నీ అంటున్నాడు.

మీరిలా రౌండ్ రౌండ్ తిరుగుతుంటే ఉన్న‌ట్టుండి ఫిజ్జా తినాలనిపిస్తుంది.. అని నేహాశెట్టి అంటుంటే..

వెంట‌నే బ‌న్నీ ఫోన్‌లో జొమాటో యాప్‌ను చూపిస్తూ.. ఫిజ్జా అయినా పెస‌ర‌ట్టు అయినా జొమాటో ఉందిగా అని చెబుతున్న ప్రోమో ఆక‌ట్టుకుంటోంది.

Recent

- Advertisment -spot_img