Nidhi Agarwal, who has been busy on social media more than movies, recently shared a video through her Twitter account. She simply commented, “Did you make an entry into rehearsals?”
బాలీవుడ్ సినిమా ‘మున్నా మైఖేల్’ సినిమాతో సినీ గడప తొక్కిన అందాల నిధి అగర్వాల్.. ‘సవ్యసాచి’ మూవీతో తెలుగు తెరకు పరిచయమైంది.
ఈ సినిమాతో అమ్మడికి అంతగా గుర్తింపు రాకపోయినా డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఆమెను ఇస్మార్ట్ బ్యూటీగా లైమ్ లైట్ లోకి తీసుకొచ్చారు.
‘ఇస్మార్ట్ శంకర్’ సినిమాతో టాలీవుడ్ క్రేజీ హీరోయిన్‌గా మారిన ఈ ముద్దుగుమ్మ తన పాపులారిటీని మరింత పెంచుకునేలా హాట్ హాట్ ఫొటో షూట్స్‌తో సోషల్ మీడియా వేదికలను వేడెక్కిస్తోంది. గ్లామర్ డోస్ పెంచుతూ అందరి దృష్టి తనపై పడేలా చేసుకుంటోంది.
ఇప్పటికే ఆమె తమిళంలో జయం రవితో భూమి, శింబుతో ఈశ్వరన్ సినిమాల్లో నటించింది. ఈ రెండు సినిమాలు ఈ సంక్రాంతికే ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. అదేవిధంగా తెలుగులో సూపర్ స్టార్ మహేష్ బాబు బావ, ప్రముఖ వ్యాపారవేత్త గల్లా జయదేవ్ కుమారుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్న కొత్త సినిమాలో ఆమె నటిస్తోంది. అతి త్వరలో ఈ మూవీ కూడా విడుదల కానుంది.