డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా వస్తున్న చిత్రం “పుష్ప 2 ది రూల్”. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ సినిమా పై ఇప్పటికే భారీ అంచనాలు నెలకొని ఉన్న విషయం తెలిసిందే. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా టీజర్ కు నేషనల్ వైడ్ గా సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చింది. ఈ టీజర్‌కి ఇప్పటి వరకు 130 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. అంతేకాదు 2 మిలియన్లకు పైగా లైక్‌లు వచ్చాయి. అయితే తాజా ఈ సినిమా నుండి ఫస్ట్ సింగిల్ పుష్ప పుష్ప అంటూ సాగే పాటను మేకర్స్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ ‘పుష్ప పుష్ప’ లిరికల్ సాంగ్‌ను మొత్తం 6 భాషల్లో చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఇప్పుడు ఈ పాటకు కూడా అదిరిపోయే రెస్పాన్స్ వస్తోంది. ఇది యూట్యూబ్‌లో భారీ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఇప్పటి వరకు అన్ని భాషల్లో కలిపి 63 మిలియన్లకు పైగా వ్యూస్ వచ్చాయి. ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఫాహద్ ఫాసిల్, అనసూయ భరద్వాజ్, ధనంజయ, రావు రమేష్, సునీల్ తదితరులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు.