రెండో దశలో కరోనా వైరస్ రెట్టింపు వేగంతో వ్యాప్తి చెందుతోంది. రోజు లక్షలాది మంది ఈ వైరస్ బారిన పడుతుండగా.. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు.
ఈ పరిస్థితులపై నటి కాజల్ అగర్వాల్ స్పందించింది. తన అభిమానులను ఉద్దేశిస్తూ.. సోషల్‌మీడియాలో భావోద్వేగ పోస్ట్ పెట్టింది.
రెండో దశలో కరోనా వైరస్ ప్రభావం సినీ పరిశ్రమపై గట్టిగానే ఉంది. లాక్‌డౌన్ ఎత్తివేయడంతో షూటింగ్‌లు యధావిధిగా ప్రారంభం అయ్యాయి.
దీంతో ఒక్కొక్కరిగా ఈ మహమ్మారి బారిన పడుతున్నారు.
ఇప్పటికే బాలీవుడ్‌లో అమీర్ ఖాన్, మాధవన్, కత్రినా కైఫ్, ఆలియా భట్ తదితరులకు కరోనా సోకగా.. తెలుగు ఇండస్ట్రీలో పవన్‌కళ్యాణ్, దిల్ రాజు, బండ్ల గణేశ్, సోనూసూద్, హీరోయిన్ నివేదా థామస్‌లకు కరోనా సోకింది.
ఈ నేపథ్యంలో అందరూ జాగ్రత్తలు తీసుకోవాలంటూ ప్రతీ ఒక్కరు చెబుతున్నారు.
అయితే ప్రస్తుత పరిస్థితి చూసి కలవరపాటుకు గురైన నటి కాజల్ అగర్వాల్.. సోషల్‌మీడియా ద్వారా స్పందించింది.
‘‘ప్రస్తుతం కరోనా కారణంగా ప్రపంచం భయానకంగా మారింది. మనం ఊహించని రీతిలో మన ఆరోగ్యానికి, ఓర్పుకు ఈ మహమ్మారి పరీక్ష పెడుతోంది. మనందరం మన కోసం శ్రమించే ఈ ఆరోగ్య వ్యవస్థకు భారం కాకుండా ఉందా’’ అని రాసుకొచ్చింది కాజల్.
‘‘మీరు ఎప్పుడైనా త్యాగం చేశారా? ఒక అమ్మాయిని వేరే ఇంటికి పంపించడం..
కొన్ని మైళ్ల దూరంలో ఉన్న కాలేజీ మన సోదరులను పంపడం.. పెంపు జంతువుకు దీర్ఘకాలిక వ్యాధి ఉండటం..
వయస్సు మళ్లీన గ్రాండ్స్ పేరెంట్స్‌కి దూరం అవడం, ఒక స్నేహితుడి మిమ్మల్ని అపార్థం చేసుకోవడం, మీరు ప్రేమించే వ్యక్తి మౌనం వహించడం, ప్రేమానుబంధాలకు మిమ్మల్ని మీరే దూరం చేసుకోవడం..
ఇలాంటివి జరిగితే మీకు నష్టం అంటే ఏంటో తెలుస్తుంది. అది మీకు ఊహించినట్లు మీ ముందుకు రాదు.. రూపం మార్చుకుంటుంది.
కాబట్టి విషాదంతో బేరాలు వద్దు. బాధ మనకే.. గ్రహాంతరవాసికి కాదు’’ అంటూ కాజల్ పేర్కొంది.